ఎన్టీఆర్ త్రివిక్రమ్ మరో క్రేజీ సినిమా

ఎన్టీఆర్ త్రివిక్రమ్ మరో క్రేజీ సినిమా

0
113

తెలుగులో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఏదైనా కథని సెలక్ట్ చేసుకున్నారు అంటే ఆ కథ హిట్ అవ్వాల్సిందే.. మాటలు దానికి సంభాషణలు పదిమందిని వారి గుండెకి టచ్ చేస్తాయి ఆయన కథల్లో. సమాజంలో కుటుంబాల మధ్య బంధాలు బంధుత్వాలకు మంచి విలువ ఇచ్చేలా సినిమాలు తీస్తారు ఆయన. గత చిత్రాలు చూసినా మంచి మెసేజ్ ఉంటుంది. అందుకే ఆయనని అందరూ గురూ జీ అంటారు.

ఇక త్రివిక్రమ్ సినిమాలకి ఆయన సంభాషణలే బలం. అలాంటి త్రివిక్రమ్ .. పెద్ద గ్యాప్ లేకుండా పవన్ .. మహేశ్ .. అల్లు అర్జున్ లతో ఎక్కువ సినిమాలు చేశాడు. స్టార్ హీరోలతో సినిమాలు చేయడం వల్ల పెద్ద సినిమాలు మాత్రమే ఆయన చేశారు, అవన్నీ బ్లాక్ బ్లాస్టర్ హిట్ చిత్రాలుగా నిలిచాయి.

ఇక ఇప్పుడు తన తదుపరి సినిమాను ఆయన ఎన్టీఆర్ తో చేయనున్నట్టు టాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి, అయితే ఎన్టీఆర్ కు అరవింద సమేత చిత్రంతో మంచి హిట్ ఇచ్చారు త్రివిక్రమ్ , తర్వాత ఆయన ఆర్ ఆర్ ఆర్ సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు, ఈ చిత్ర షూటింగ్ తో పాటు పలు సినిమా కథలు వింటున్న తారక్, వాటిలో ఒకటి సెట్స్ పై పెడతారు అని వార్తలు వస్తున్నాయి. కాని తాజా టాలీవుడ్ వార్తల ప్రకారం రాజమౌళి సినిమా తరువాత మళ్లీ త్రివిక్రమ్ తోనే మూవీ చేయాలనే ఉద్దేశంతో ఎన్టీఆర్ ఉన్నట్టుగా చెబుతున్నారు. అయితే వచ్చే ఏడాది దసరా
నుంచి ఈ చిత్రం స్టార్ట్ చేస్తారని టాక్ నడుస్తోంది.