ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమాలో ఆ హీరోయిన్ కు ఛాన్స్ ?

ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమాలో ఆ హీరోయిన్ కు ఛాన్స్ ?

0
95

తెలుగు సినిమా పరిశ్రమలో ఆమెకి ఇప్పుడు వరుస అవకాశాలు వస్తున్నాయి, స్టార్ హీరోలతో కమర్షియల్ హిట్లకు కేరాఫ్ అడ్రస్ అవ్వబోతోంది ఈ అమ్మడు, నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగు చిత్రపరిశ్రమకి పరిచయం అయింది నభా నటేష్.. ఆ తర్వాత పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాలో నటించింది, అందం అభినయం ఉన్న నటి ఆమె.

ఇటీవల రవితేజ హీరోగా నటించిన డిస్కో రాజా సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఆ సినిమాలో నభా నటనకు మంచి మార్కులే పడ్డాయి.సాయి ధరమ్ తేజ్ హీరోగా నూతన దర్శకుడు సుబ్బు దర్శకత్వంలో తెరకేక్కబోయే సోలో బ్రతుకే సో బెటరూ అనే సినిమాలో హీరోయిన్ గా ఫిక్స్ అయింది నభా.

తాజాగా టాలీవుడ్ లో ఓ వార్త వినిపిస్తోంది, నభాకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో నటించే ఛాన్స్ దక్కింది అని తెలుస్తోంది. తారక్ త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఓ సినిమా చేయనున్నారు, ఆర్ ఆర్ ఆర్ తర్వాత సెట్స్ పైకి వెళ్లనుంది ఈ చిత్రం…ఈ సినిమాని హారిక అండ్ హాసిని ఎంటర్టైన్మెంట్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ పై రాధాకృష్ణ – కళ్యాణ్ రామ్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయినను పోయిరావలె హస్తినకు అనే టైటిల్ కూడా వినిపిస్తోంది, అయితే ఇందులో ఇద్దరు హీరోయిన్స్ అని ఇందులో నభా ఓ ఛాన్స్ దక్కించుకుంది అని వార్తలు వస్తున్నాయి.