ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత సెట్స్ పైకి రానుంది.. ఇప్పటికే చిత్రాన్ని ప్రకటించారు కూడా, అయితే
ఎన్టీఆర్30 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా రానుంది, అయితే వచ్చే ఏడాది ఈ సినిమా వెంటనే సెట్స్ పై పెట్టాలి అని త్రివిక్రమ్ ఆలోచనలో ఉన్నారు, కథ పై పూర్తి వర్క్ చేస్తున్నారు.అరవింద సమేత వీరి కాంబోలో ఎంత హిట్ అయిందో తెలిసిందే, మరి ఈసారి ఏ కథ వస్తుందో అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.
అయినను పోయిరావలే హస్తినకు అనే పేరు ఈ సినిమాకు వినిపిస్తోంది.. ఈ సినిమా చాలా భాగం ఇక్కడ ఇండోర్ లో పూర్తి చేస్తారు, ఇక ఈ సినిమాలో పవర్ ఫుల్ పాత్ర కోసం రమ్యకృష్ణని తీసుకోనున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి, మరి చర్చలు జరుగుతున్నాయి అంటున్నారు
అయితే ఇందులో ఏ హీరోయిన్ నటిస్తారు అంటే తాజాగా చాలా మంది పేర్లు వినిపించాయి అయితే ఇప్పుడు
కియారా అద్వానీ పేరు వినిపిస్తోంది. భరత్ అనే నేను సినిమాతో ఈ అందాల తార తెలుగు సినిమా పరిశ్రమలో అందరికి బాగా దగ్గర అయింది.. కుర్రాకారుని తన అందంతో కట్టిపారేసింది, తాజాగా ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమాలో నటించనుందని టాక్. ఇక ఈ చిత్రంలో సంజయ్ దత్ కూడా ఓ పవర్ ఫుల్ పాత్ర చేస్తారు అని టాక్ వినిపిస్తోంది. మరో వార్త ఏమిటి అంటే ఈ చిత్రంలో రెండో హీరోయిన్ కూడా ఉంటుంది అని తెలుస్తోంది, అందుకే ధిల్లీ భామ కేతిక శర్మను కూడా పరిశీలిస్తున్నారట.