ఎన్టీఆర్ త్రివిక్రమ్ మూవీకి డేట్ ఫిక్స్…

ఎన్టీఆర్ త్రివిక్రమ్ మూవీకి డేట్ ఫిక్స్...

0
89

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో నటిస్తున్నాడు… ఈచిత్రం పూర్తి అయిన తర్వాత తన నెక్ట్స్ మూవీని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేయనున్నాడు..ఈ చిత్రానికి హస్తినకు పోయిరావాలే అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి…

ఇది ఇలా ఉంటే తాజా ఫిలింనగర్ సమాచారం ప్రకారం ఆర్ ఆర్ ఆర్ చిత్రం షూటింగ్ పూర్తి అయిన తర్వాత ఎన్టీఆర్ మార్చినెలలో త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీ షూట్ లో పాల్గొంటారని వార్తలు వస్తున్నాయి…

ఈ చిత్రంలో సీనియర్ నటి రమ్యకృష్ణ నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి… ఈ చిత్రంలో రమ్యకృష్ణకు పవర్ ఫుల్ రోల్ ను ఇచ్చే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది… కాగా బాహుబలి చిత్రంలో రమ్యకృష్ణనటించిన సంగతి తెలిసిందే… ఈ సినిమా ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది…