NTR vs పులి ఫైట్ సీన్ యూట్యూబ్ లో వైరల్

0
86

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్.. కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ కనిపించనున్నాడు. ఈ సినిమా కోసం తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు నాలుగు ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నారు. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ట్రిపుల్ ఆర్ నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది.

ఈ సినిమాలో నిప్పు, నీరు… అంటూ రెండు శ‌క్తుల్ని ప‌రిచ‌యం చేస్తూ సినిమాని ఆరంభించారు ద‌ర్శ‌కుడు రాజమౌళి. ఆ శ‌క్తుల‌కి త‌గ్గ‌ట్టే ఉంటాయి ప‌రిచ‌య స‌న్నివేశాలు. రామ్‌చ‌ర‌ణ్‌ని భారీద‌నంతో కూడిన‌, అత్యంత స‌హ‌జ‌మైన లాఠీఛార్జ్ యాక్ష‌న్ ఘ‌ట్టంతో ప‌రిచ‌యం చేసిన విధానం, అందులో ఆయ‌న న‌టించిన తీరు ప్రేక్ష‌కుల‌తో చ‌ప్ప‌ట్లు కొట్టిస్తుంది.

ఇక ఆ త‌ర్వాత ఎన్టీఆర్ పులితో క‌లిసి చేసే విన్యాసాల‌తో క‌థ‌లోకి ఎంట్రీ ఇస్తారు. NTR vs పులి ఫైట్ సిన్ సినిమాకే హైలెట్ గా నిలుస్తుంది. ప్రస్తుతం ఈ సీన్ కి సంబంధించిన వీడియో యూట్యూబ్ లో వైరల్ గా మారింది.

వీడియో చూడడానికి కింది లింక్ ను క్లిక్ చేయండి.

https://youtu.be/KIFSwcBS6RI