టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ కి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు… ఆయన సినిమా వస్తోంది అంటే అభిమానులకి పండుగ ..ఎన్టీఆర్ మనవడిగా నందమూరి వంశంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు… తాతకు తగ్గ మనవడు అనే పేరువచ్చింది తారక్ కి… ఇక నటన డ్యాక్స్ డైలాగ్ డెలివరీలో తారక్ తర్వాతే ఎవరైనా, ఇక తారక్ ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమాలో చేస్తున్నారు.
ఆయన కుటుంబానికి ఎంత విలువ ఇస్తారో తెలిసిందే.. కొంచెం సమయం ఉన్నా కుటుంబంతోనే ఆయన గడుపుతారు,
ఇక తాజాగా టాలీవుడ్ లో ఓ వార్త వినిపిస్తోంది, తన భార్య లక్ష్మీప్రణతితో కలిసి ఈ మధ్య ఫంక్షన్లకు ఆయన అటెండ్ అవుతున్నారు.ఈ నెల 18న ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీప్రణతి పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు. అయితే ఈ వేడుకలు తమ కుటుంబ సభ్యులు ఫ్రెండ్స్ మధ్య జరిగాయి.
అయితే ఈ సమయంలో తారక్ తన భార్యకు ఓ అరుదైన గిఫ్ట్ ఇచ్చారు అని తెలుస్తోంది..
హైదరాబాద్ నగరంలో ఓ పెద్ద ఫామ్ హౌస్ను భార్య పేరిట రాయించాడట ఎన్టీఆర్. ఇక అదే ఫామ్ హౌస్ లో ఆమె పుట్టిన రోజు వేడుకలు జరిగినట్లు తెలుస్తోంది… దీంతో ఆమె చాలా ఆనందంలో ఉన్నారు, జూనియర్ ఎన్టీఆర్ 2011 మే 5న ప్రణతిని వివాహం చేసుకున్నారు. ఇక ఈ వార్త టాలీవుడ్ లో వినిపిస్తోంది ఇప్పుడు.
ReplyForward
|