ఎవరు మీలో కోటీశ్వరులు షోలో తన పెళ్లికి సంబంధించి ఆసక్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన‌ ఎన్టీఆర్‌

NTR who made interesting comments regarding his marriage in Meelo Evaru Koteeswarudu show

0
55

సినిమా హీరోలు ఎంతో బిజీగా ఉంటారు. షూటింగ్ ల‌తో వేరే దేశాలు వెళుతూ ఉంటారు. అయితే కాస్త గ్యాప్ దొరికింది అంటే కుటుంబానికి స‌మ‌యం కేటాయిస్తారు. ఇలా ఎక్కువ‌గా ఫ్యామిలీకి ప్రాధాన్య‌త ఇచ్చే హీరోల్లో ఎన్టీఆర్ కూడా ఒక‌రు. కొంచెం స‌మ‌యం దొరికినా ఫ్యామిలీతో స‌ర‌దాగా ఉంటారు.
ఎన్టీఆర్‌, లక్ష్మీ ప్రణతిలది పెద్దలు కుదిర్చిన వివాహం.

ప్ర‌స్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమా పూర్తి చేశారు తార‌క్ . తాజాగా ఎవరు మీలో కోటీశ్వరులు షోకి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ స‌మ‌యంలో త‌న పెళ్లికి సంబంధించి కొన్ని విషయాలు చెప్పారు.
పెళ్లి చూపుల సమయంలో లక్ష్మీ తనతో అస్సలు మాట్లాడలేదని చెప్పారు తార‌క్ . నేను ఆమెని చూసి ఒకే చెప్పాను. కానీ ఆమె మాత్రం వెంట‌నే ఎస్ చెప్ప‌లేదు అన్నారు.

నేను ఆమెతో మాట్లాడాను? నేనంటే ఇష్ట‌మేనా లేదా బ‌ల‌వంతంగా పెళ్లి ఫిక్స్ చేస్తున్నారా అని అడిగాను.దానికి ఆమె అప్పట్లో ఔనని కానీ కాదని కానీ ఎలాంటి సమాధానం ఇవ్వలేదట‌. ఇలా ఎంగేజ్ మెంట్ కి వివాహానికి 8 నెల‌ల గ్యాప్ ఉంది. అప్ప‌టికీ ఆమె ఎస్ అని చెప్ప‌లేద‌ట‌. ఆడవాళ్లను అర్థం చేసుకోవడం ఎంత కష్టమో అర్థమైందంటూ ఎన్టీఆర్‌ తెలిపారు.