Simhadri Re Release |ఆర్ఆర్ఆర్ సినిమాతో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఇటీవల ఆయన పుట్టినరోజు సందర్భంగా రాజమౌలి దర్శకత్వంలో వచ్చిన సింహాద్రి సినిమాను రీరిలీజ్ చేశారు. మొదటి రోజు నుంచే చెప్పుకోదగ్గ వసూళ్లను రాబట్టింది కానీ ఆ తరువాతి రోజు నుంచి కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. ఈ సినిమా మొదటి రోజు.. నైజాంలో రూ.1.06 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించగా, తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా రూ. 2.90 కోట్ల గ్రాస్ రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా తొలి రోజు రూ. 4.01 కోట్ల గ్రాస్ వసూళ్లతో దుమ్ము దులిపింది. కానీ ఖుషీ రికార్డుకు కాస్త దూరంలో ఆగిపోయింది. సింహాద్రి టోటల్ రీ రిలీజ్(Simhadri Re Release)లో రూ. 4.60 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి టాప్ 2లో నిలిచింది.
NTR సింహాద్రి రీరిలీజ్.. కలెక్షన్స్ ఎన్ని వచ్చాయో తెలుసా?
-