యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా సింహాద్రి(Simhadri) సినిమాను రీరిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా 11 వందలకు పైగా థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేశారు. దీంతో సింహాద్రి(Simhadri)గా స్క్రీన్ పై ఎన్టీఆర్ మాస్ నటనకు థియేటర్స్ అన్నీ దద్దరిల్లిపోతున్నాయి. తాజాగా లండన్‌లో కూడా ఎన్టీఆర్ థియేటర్స్‌లో హంగామా చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంచిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. ఇది చూసిన ఫ్యాన్స్.. ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా, ఈ సినిమాకు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌలి(SS Rajamouli) దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఇక ఎన్టీఆర్(NTR) ప్రస్తుతం కొరటాల శివ(Koratala Siva) దర్శకత్వంలో దేవర అనే సినిమా చేస్తున్నాడు. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.
Read Also: టాలీవుడ్లో తీవ్ర విషాదం.. ప్రముఖ సంగీత దర్శకుడు కన్నుమూత
Follow us on: Google News, Koo, Twitter