నగ్న చిత్రాల సూత్రధారి వంశి కృష్ణ అరెస్ట్

నగ్న చిత్రాల సూత్రధారి వంశి కృష్ణ అరెస్ట్

0
83

విజయవాడ నగ్న చిత్రాల కేసును పోలీసులు వేగవంతం చేసారు. ప్రేమ పేరుతొ మోసం చేసి యివతి నగ్న చిత్రాలను తీసి తొగదీసుకున్న కేసులో అసలు సూత్రధారి వంశీకృష్ణ అరెస్ట్ కి రంగం సిద్ధం చేశారు. ఆస్ట్రేలియా నుంచి వంశీని తీసుకొచ్చేందుకు సన్నాహాలు సిద్ధం చేస్తున్నారు. ఓ బర్త్ డే ఫంక్షన్ లో పరిచయమైన అమ్మాయిని మాయ మాటలతో లొంగదీసుకున్నాడు. ఏకాంతంగా ఉన్నప్పుడు వీడియోలు తీసుకున్నాడు అనంతరం ఉన్నత చదువుల కోసం ఆస్ట్రేలియా వెళ్ళాడు.

ఆస్ట్రేలియా వెళ్లిన వంశీ తన దగ్గర ఉన్న నగ్న చిత్రాలను తన స్నేహితుడు జగదీష్ కు పంపించాడు. వాటిని అడ్డం పెట్టుకుని జగదీష్ ఆ అమ్మాయిని లైంగికంగా వేధించడం మొదలు పెట్టాడు. తనతో వీడియోలు ఉండడంతో బాధితురాలు మౌనంగా భరించింది. ఇక రోజు రోజుకు జగదీష్ అరాచకాలు పెరిగి పోవడంతో పోలీసులను ఆశ్రయించింది బాధితురాలు దింతో జగదీష్ ని విచారిస్తే అసలు విషయం బయటకు వచ్చింది.

ఈ ఘోరానికి కారకుడైన జగదిష్ స్నేహితుడు కృష్ణను అరెస్టు చేయొద్దని జిల్లా కోర్ట్ ఓపెన్ డేటెడ్ వారెంట్ పిటిషన్ దాఖలు చేయబోతున్నారు. ఆ తర్వాత సిఐడి ద్వారా రెడ్కార్నర్ నోటీసు జారీ చేయడానికి కసరత్తు చేస్తున్నారు. జగదీష్, కృష్ణ వంశీలను కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నారు.