మహా సముద్రం మూవీ రివ్యూ

0
78

శర్వానంద్, సిద్ధార్థ్ ప్రధాన పాత్రలలో ఆర్ఎక్స్ 100 మూవీ డైరెక్టర్ అజయ్ భూపతి తెరకెక్కించిన చిత్రం ‘మహా సముద్రం’. అదితీరావు హైదరి, అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ సినిమాకు అనిల్ సుంకర నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 14న ప్రేక్షకులకు వచ్చింది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్స్ మహాసముద్రం మూవీపై హైప్ క్రియేట్ చేయగా ఈ మూవీ ప్రేక్షకులను ఏ మేర ఆకట్టుకుందో చూద్దాం.

వైజాగ్‌ నగరానికి చెందిన అర్జున్‌(శర్వానంద్‌), విజయ్‌(సిద్ధార్థ్‌) ఇద్దరు ప్రాణ స్నేహితులు. విజయ్‌ పోలీసు ఉద్యోగం కోసం ట్రై చేస్తుంటాడు. మరోవైపు మహాలక్ష్మీ అలియాస్‌ మహా(అదితిరావు హైదరీ)తో ప్రేమలో ఉంటాడు విజయ్‌. పోలీసు ఉద్యోగం సంపాదించాక పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. అర్జున్‌ లైఫ్‌లోకి అనుకోకుండా వస్తుంది లా స్టూడెంట్‌ స్మిత(అను ఇమ్మాన్యుయేల్‌).

వరుసగా జరిగే కొన్ని సంఘటనల వల్ల విజయ్‌ వైజాగ్‌ సిటీ నుంచి పారిపోవాల్సి వస్తుంది. అతని ఆచూకీ కోసం అర్జున్‌ ఎంత వెతికిన ప్రయోజనం ఉండదు. దాదాపు నాలుగేళ్ల తర్వాత పారిపోయిన విజయ్‌ తిరిగి మళ్లీ వైజాగ్‌కు వస్తాడు. అప్పటికీ అర్జున్‌ డ్రగ్స్‌ మాఫియా డాన్‌గా ఎదుగుతాడు. అసలు విజయ్‌ వైజాగ్‌ సిటీని వదిలి ఎందుకు పారిపోయాడు? బిజినెస్‌ చేయాలనుకునే అర్జున్‌ స్మగ్లింగ్‌, డ్రగ్స్‌ దందాను ఎందుకు ఎంచుకున్నాడు? ప్రాణ స్నేహితులైన అర్జున్‌, విజయ్‌ శత్రువులుగా ఎలా మారారు? విజయ్‌ ప్రాణంగా ప్రేమించిన మహాకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? ఆ సమయంలో అర్జున్‌ ఎలా తోడుగా నిలిచాడు అనేదే మిగిలి కథ.

అర్జున్ పాత్ర‌లో శ‌ర్వా చ‌క్క‌గా ఒదిగిపోయారు. అటు యాక్ష‌న్ స‌న్నివేశాల్లో.. ఇటు ఎమోష‌నల్ స‌న్నివేశాల్లో చ‌క్క‌టి ప‌రిణ‌తి క‌నబ‌రిచాడు. విజ‌య్ పాత్ర‌లో సిద్ధార్థ్ డిఫెరెంట్ లుక్‌తో క‌నిపించినా.. ఆ పాత్ర‌ను తీర్చిదిద్దిన తీరు ఏ మాత్రం ఆక‌ట్టుకోదు. అయితే ప్రేమ స‌న్నివేశాల్లో శ‌ర్వా – అనుల జోడీతో పోల్చితే సిద్ధు – అదితిల జంట‌కే ఎక్కువ మార్కులు ప‌డ‌తాయి. రొమాంటిక్ స‌న్నివేశాల్లో ఇద్ద‌రి కెమిస్ట్రీ మెప్పిస్తుంది. ఆక‌ట్టుకునేలా క‌థ‌.. క‌థ‌నాలు రాసుకోవ‌డంలోనూ, ఆస‌క్తిక‌ర‌మైన తీరులో స్క్రీన్‌ప్లే అల్లుకోవ‌డంలోనూ అజ‌య్ భూప‌తి త‌డ‌బ‌డ్డాడు. సెకండాఫ్ ఇంకా బాగుంటే సినిమా ఓ రేంజ్ లో ఉండేదని పబ్లిక్ టాక్.

బ‌లాలు:  ప్ర‌ధ‌మార్ధం, శ‌ర్వానంద్‌, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్

బ‌లహీన‌త‌లు: క‌థ‌, క‌థ‌నం, ద్వితీయార్ధం