నాని చేతుల మీదుగా ‘ఓసీఎఫ్ఎస్’ టీజ‌ర్ విడుద‌ల‌

'OCFS' teaser released over Nani's hands

0
122

జీ5లో ప్ర‌సారం కానున్న ఓసీఎఫ్ఎస్ (ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ ) వెబ్ సిరీస్ టీజ‌ర్‌ను నేచుర‌ల్ స్టార్ నాని ఈ రోజు విడుద‌ల చేశాడు. ‘ఇదిగో ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ టీజ‌ర్. ఈ వెబ్ సిరీస్ బృందానికి నా బెస్ట్ విషెస్.. టీజ‌ర్ చాలా స‌ర‌దాగా ఉంది’ అని నాని పేర్కొన్నాడు. ఈ వెబ్ సిరీస్‌కు నిర్మాతగా నాగ‌బాబు కుమార్తె నిహారిక వ్యవహరిస్తోన్న విష‌యం తెలిసిందే.

ఫ్యామిలీ ఎంటర్టైన్ మెంట్ గా రూపుదిద్దుకున్న ఈ వెబ్ సిరీస్‌ జీ5లో నవంబర్ 19న ప్రారంభం కానుంది. ఈ వెబ్ సిరీస్ 40 నిమిషాల నిడివి చొప్పున‌ మొత్తం 5 ఎపిసోడ్లుగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇందులో సంతోష్ శోభన్, సిమ్రాన్ శర్మ హీరో హీరోయిన్లుగా న‌టిస్తుండ‌గా, సీనియర్ నటీనటులు నరేశ్, తులసి కీలక పాత్రలు పోషిస్తున్నారు.