ఒకేసారి పవన్ అభిమానులకి రెండు గిఫ్ట్ లు ఖుషీ ఖుషీ

ఒకేసారి పవన్ అభిమానులకి రెండు గిఫ్ట్ లు ఖుషీ ఖుషీ

0
121

పవన్ కల్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో రెండేళ్ల విరామం తర్వాత ఆయన సినిమా స్టార్ట్ చేశారు.. ఇక వకీల్ సాబ్ చిత్ర షూటింగ్ కూడా జరుగుతోంది, దీనితో పాటు మరో రెండు చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు,
వేణు శ్రీరామ్ దర్శకత్వంలో బోనీ కపూర్తో కలిసి దిల్ రాజు నిర్మిస్తున్న ఈ వకీల్ సాబ్ ఫస్ట్ లుక్ ఇప్పటికే భారీ క్రేజ్ని సొంతం చేసుకుంది. అయితే సెప్టెంబర్ 2న పవన్ బర్త్డే సందర్భంగా వకీల్ సాబ్ టీజర్ని రిలీజ్ చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది.

ఇక ఆయన మరో సినిమా క్రిష్ తో చేస్తున్నారు, కోహినూర్ వజ్రం నేపథ్యంలో క్రిష్ తెరకెక్కిస్తున్న పిరియాడిక్ ఫిల్మ్ చేస్తున్నారు. ఏ.ఎం. రత్నం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్కు చెందిన అర్జున్ రాంపాల్ కీలక పాత్రలో నటించనున్నారు. శ్రీలంకన్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కనిపించనుంది, ఈ సినిమా పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కిస్తున్నారు.

ముందు నుంచి మీడియాలో ఈ చిత్రానికి విరూపాక్షఅనే టైటిల్ని అనుకుంటున్నారు, అయితే తాజాగా బందిపోటు గజదొంగ, మంచి దొంగ, చోర్ వంటి పేర్లు వినిపిస్తున్నాయి. ఇక సెప్టెంబర్ 2న ఈ చిత్ర టైటిల్ని, ఫస్ట్ లుక్ని రిలీజ్ చేయాలనే ఆలోచనలో దర్శకుడు క్రిష్ ఉన్నారని ఆరోజు పవర్ స్టార్ పుట్టిన రోజు కావడంతో ఆయన అభిమానులకు ఇది గిఫ్ట్ గా ఉంటుంది అంటున్నారు అందరూ.