తెలంగాణలో సినిమా థియేటర్ల మూసివేత వార్తలపై – స్పందించిన మంత్రి 

-

తెలంగాణలో భారీగా కేసులు నమోదు అవుతున్నాయి.. ఈ సమయంలో మళ్లీ గత కరోనా లాక్ డౌన్ టైమ్ లో తీసుకున్న నిర్ణయాలు తీసుకుంటారు అని జనం బెంబెలెత్తుతున్నారు, ఇక సోషల్ మీడియాలో కూడా అనేక ప్రచారాలు జరుగుతున్నాయి, ఇక మళ్లీ లాక్ డౌన్ అని వార్తలు వినిపిస్తున్న వేళ ,  లాక్ డౌన్ విధించే ఆలోచన లేదు అని తెలిపింది ప్రభుత్వం.
ఇక స్కూళ్లు కాలేజీలు మాత్రం బంద్ చేశారు, అయితే నేడు మళ్లీ థియేటర్లు బంద్ అవుతాయి అని వార్తలు వినిపిస్తున్నాయి, లేదా 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడుస్తాయి అని వార్తలు వినిపించాయి.. దీనిపై తెలంగాణ ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. కరోనా కేసుల తీవ్రత నేపథ్యంలో తెలంగాణలో థియేటర్లు మూసివేస్తారని వస్తున్న వార్తలను సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఖండించారు.
ఇక ఇలాంటి వార్తలు నమ్మక్కర్లేదు, రాష్ర్టంలో సినిమా థియేటర్లను మూసివేయడం లేదని తేల్చిచెప్పారు. థియేటర్లు మూసివేస్తారన్న ప్రచారాన్ని నమ్మొద్దు అని సూచించారు. కరోనా నిబంధనలు అన్నీ పాటించి థియేటర్లు నడుస్తాయి అని తెలిపారు. సినిమా థియేటర్ కు వెళ్లే వారు ప్రతీ ఒక్కరు కచ్చితంగా మాస్క్ ధరించి జాగ్రత్తలు తీసుకోవాలి అని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...