మరోసారి బన్నీతో పూజా హేగ్డే – ఏ సినిమా అంటే ?

once again Pooja Hegde with allu arjun movie

0
82

పూజ హెగ్డే వరుస సినిమాలతో చాలా బిజీగా ఉంది. ఇప్పుడు టాలీవుడ్ లో ఎన్నో సినిమాలతో సూపర్ బిజీ హీరోయిన్ అంటే ఆమె అని చెప్పాలి .ఇక ఆమె చేసిన అన్ని సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు దర్శక నిర్మాతలు చాలా మంది ఆమెనే హీరోయిన్ గా అనుకుంటున్నారు. అన్ని హిట్స్ రావడంతో హీరోల ఛాయిస్ కూడా ఇప్పుడు పూజానే.

అయితే అల వైకుంఠపురం సినిమా ఆమెకు మంచి పేరు తీసుకువచ్చింది . అంతకు ముందు ఆమె బన్నీతో డీజే దువ్వాడ జగన్నాథం చిత్రంలో నటించారు. ఈ రెండు కూడా సూపర్ హిట్ అయ్యాయి. తాజాగా ఆమె మరో సారి బన్నీతో జతకట్టే అవకాశం ఉంది అని వార్త‌లు వినిపిస్తున్నాయి. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో బన్నీ ఐకాన్ సినిమా చేయనున్నారు. ఈ చిత్రంలో బన్నీ సరసన ఆమె నటించే ఛాన్స్ ఉందని టాలీవుడ్ టాక్.

ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇక పవన్ హరీశ్ సినిమాకి కూడా ఆమె పేరుని పరిశీలిస్తున్నారని టాక్ నడుస్తోంది. ఈ వార్త బన్నీ ఫ్యాన్స్ కి వినిపించడంతో ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడం ఖాయం అంటున్నారు.