ఎఫ్ 3 నుండి ఊ..ఆ..ఆహా ఆహా ఫుల్ సాంగ్ రిలీజ్ (వీడియో)

0
102

అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన లేటెస్ట్ మూవీ ఎఫ్ 3. ఈ సినిమాలో హీరోల సరసన తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా నటించారు. ఎఫ్ 2 పోయిన 2019 సంక్రాంతికి విడుదలైన ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది.

ఎఫ్ 2 మూవీ కి సీక్వెల్ గా ఈ సినిమాను అనిల్ రావిపూడి తెరెక్కిస్తున్నాడు. ఎఫ్2 మూవీలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ తమదైన శైలిలో నటించి భారీ విజయాన్ని సాధించారు. ఈ సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకుంది. ఈ సినిమా మే 27వ తేదీన విడుదల కానుంది.

అయితే తాజాగా ఎఫ్ 3 మూవీ నుండి ఫస్ట్ సింగల్ ను చిత్రబృందం విడుదల చేసింది. నీ కోర మీసం చేస్తూ ఉంటే… నువ్వట్టా తిప్పే స్తుంటే… ఉ ఆ ఆహా ఆహా అంటూ సాగే హాట్ సాంగ్ ప్రేక్షకులను పిచ్చెక్కిస్తుంది. తమన్నా, మెహరీన్ తమ అందాలతో పాటకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉన్నారు. అదిరిపోయే స్టెప్పులతో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ అదరగొట్టారు.

వీడియో చూడాలనుకుంటే ఈ కింది లింక్ ఓపెన్ చేయండి..

https://youtu.be/ogerst0UQsk