Ooru Peru Bhairavakona |ఉత్కంఠ భరితంగా సందీప్ కిషన్ భైరవకోన టీజర్‌

-

వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న యంగ్ హీరో సందీప్ కిషన్(Sundeep Kishan) మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యాడు. ఆనంద్‌ దర్శకత్వంలో ఊరు పేరు భైరవకోన(Ooru Peru Bhairavakona) అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్‌లు, పాటలు సినిమాపై ఎక్కడలేని హైప్‌ తీసుకొచ్చాయి. తాజాగా మేకర్స్ ఈ సినిమా టీజర్‌ను రిలీజ్‌ చేశారు. శ్రీష్ణ దేవరాయ కాలంలో చెలామణిలో ఉన్న గరుడపురాణంకు ఇప్పటి గరుడపురాణంకు నాలుగు పేజీలు తగ్గాయని, ఆ నాలుగు పేజీలే భైరవకోన(Ooru Peru Bhairavakona) అంటూ టీజర్‌తోనే సినిమా కాన్సెప్ట్ చెప్పేశారు. దర్శకుడు ఆనంద్‌ చాలా కాలం తర్వాత సస్పెన్స్‌ థ్రిల్లర్‌ జానర్‌లో సినిమా చేస్తుండటంతో అందరిలోనూ తీవ్ర ఆసక్తి నెలకొంది. టీజర్‌లో బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ హైలేట్‌గా కనిపిస్తుంది. ఈ సినిమాలో సందీప్‌కు జోడీగా కావ్యా థాపర్‌, వర్ష బొల్లమ్మ నటిస్తున్నారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌, హాస్య మూవీస్‌ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

- Advertisement -
Read Also: NTR 30 అప్‌డేట్‌.. ఫుల్ జోష్‌లో తారక్ ఫ్యాన్స్!

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...