మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్ హీరోగా తెరకెక్కిన పాన్ ఇండియా సినిమా ‘ఆపరేషన్ వాలెంటైన్’(Operation Valentine). ఈ సినిమా ద్వారా బాలీవుడ్ ఇండస్ట్రీకి వరుణ్ పరిచయం అవుతున్నాడు. శక్తిప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ తెలుగు ట్రైలర్‌ను మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, హిందీ ట్రైలర్‌ను సల్మాన్‌ఖాన్ విడుదల చేశారు.
ఫిబ్రవరి 14, 2019న పుల్వామాలో భారత జవాన్లపై జరిగిన దాడి.. అనంతరం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్థాన్ ఉగ్రవాదులపై తీర్చుకున్న ప్రతీకారం నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కింది. ఇందులో పవర్ ఫుల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాత్రలో వరుణ్ నటించాడు. హాలీవుడ్ రేంజ్ యాక్షన్ సీక్వెన్స్ ఆకట్టుకుంటున్నాయి. ట్రైలర్ చివర్లో ‘ఏం జరిగినా సరే చూసుకుందాం’ అనే డైలాగ్ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడేలా చేసింది.
ఇక ఈ సినిమాలో 2017 మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ హీరోయిన్‌గా నటించగా.. రుహానీ శర్మ, నవదీప్, తదితరులు కీలక పాత్రలు పోషించారు. సోని పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా(Operation Valentine) మార్చి 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా మూవీ విడుదల కానుంది.