టాలీవుడ్ లో మంచి ఫేమ్ తో వరుస విజయాలు అవకాశాలతో దూసుకుపోతున్నారు ముద్దుగుమ్మలు పూజాహేగ్డే, అలాగే రష్మిక, వీరిద్దరికి అవకాశాలు క్యూ కడుతున్నాయి. సరిలేరు నీకెవ్వరూ- భీష్మ ఈ రెండు సక్సెస్ లతో ఇక రష్మికకి అవకాశాలు బాగా వస్తున్నాయి, పలు సినిమాలు చేయాలి అని దర్శకులు కోరుతున్నారు.
ఇక అన్నీ స్టార్ హీరోల సినిమాలు కావడంతో పెద్ద సినిమాలు చేస్తున్నారు, భారీ రెమ్యునరేషన్ కూడా అందుకుంటున్నారు, అయితే తాజాగా హీరో రామ్ చరణ్ సరసన నటించే అవకాశం కూడా రష్మికకి వచ్చింది అని తెలుస్తోంది.కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో విద్యార్ది నాయకుడి పాత్ర రామ్ చరణ్ చేస్తున్నారు, ఈ సమయంలో ఆయనకు జోడిగా రష్మిక నటించనుంది.
ఇటీవల ఈ పాత్ర చెప్పడంతో… ఆమెకి నచ్చి ఒకే చెప్పిందట, ఇక చిరు సరసన కాజల్ నటిస్తున్న సంగతి తెలిసిందే.ఇక జనవరి నుంచి ఆమెకి సంబంధించి రెండు షెడ్యూల్స్ షూటింగ్ జరుగనున్నాయని టాలీవుడ్ టాక్ నడుస్తోంది.