ప్రస్తుతం OTT మార్కెట్ దూసుకుపోతోంది, గత ఏడాది కరోనా కారణంగా చాలా వరకూ సినిమాలు ఓటీటీ వేదికలో విడుదల అయ్యాయి, అయితే చాలా వరకూ నిర్మాతలు ఇలా సినిమాలు విడుదల ప్లాన్ చేసుకున్నారు…అయితే ఈ ఏడాది కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి… దీంతో దేశ వ్యాప్తంగా సినిమా థియేటర్లు చాలా చోట్ల క్లోజ్ అవుతున్నాయి.. మరికొన్ని చోట్ల 50 శాతం ఆక్యుపెన్సీతో నడుపుతున్నారు.
అయితే కొత్త సినిమాలు అన్నీ విడుదల వాయిదా వేశారు.. ఇక బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకూ సినిమా పరిశ్రమలో ఇదే పరిస్దితి కనిపిస్తోంది.. అయితే ఇప్పుడు ప్రజలు థియేటర్ కు వచ్చే పరిస్దితి లేదు.. దీంతో సినిమాలు చాలా వరకూ ఓటీటీలో విడుదల కానున్నాయి…అయితే ఇప్పటికే థియేటర్లో విడుదల అయిన సినిమాలు కూడా ఓటీటీలో రానున్నాయి మరి అవి ఏమిటో చూద్దాం.
వకీల్ సాబ్.. ఏప్రిల్ 30 నుంచి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ కానుంది.
థ్యాంక్ యు బ్రదర్…ఆహా లో మే 7 నుంచి స్ట్రీమింగ్ అవనుందట
సుల్తాన్… ఈ నెల 30న ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.
కర్ణన్..అమెజాన్ ప్రైమ్లో మే 9 నుంచి ప్రసారం కానున్నట్లు తెలుస్తోంది.
జగమే తంత్రం. జూన్ 18 నుంచి ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో ప్రసారం కానున్నట్లు అధికారికంగా వెల్లడించింది