‘మా’ ఎన్నికలు: కోట శ్రీనివాస్ రావు సంచలన వ్యాఖ్యలు

0
100

మా (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికల నేపథ్యంలో సీనియర్ నటుడు కోట శ్రీనివాస్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రకాష్ రాజ్ కు అసలు టైం సెన్స్ లేదంటూ కోటా వ్యాఖ్యానించారు. మా అధ్యక్షుడిగా ఉండడానికి మంచు విష్ణుకు అన్ని అర్హతలు ఉన్నాయని అన్నారు. ఎన్నికల్లో మంచు విష్ణుకు ఓటు వేయాలని, నా సపోర్ట్ విష్ణుకే అంటూ తన నిర్ణయాన్ని తెలియజేశారు. కాగా అక్టోబర్ 10న మా ఎన్నికలు జరగనున్నాయి. మా అధ్యక్ష బరిలో ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ఉన్న సంగతి తెలిసిందే.