మా అధ్యక్షుడు మంచు విష్ణు ఆఫీస్ లో చోరీ కలకలం రేపుతోంది. ఫిల్మ్ నగర్ లోని ఆఫిస్ లో 5 లక్షల రూపాయలు విలువ చేసే హెయిర్ డ్రెస్సింగ్ సామగ్రి చోరీ అయినట్లు తెలుస్తుంది. హెయిర్ డ్రెసర్ నాగ శ్రీను మీద అనుమానం వ్యక్తం చేసిన మంచు విష్ణు మెనేజర్ సంజయ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.