బాలీవుడ్ స్టార్ హీరోలు అక్షయ్ కుమార్(Akshay Kumar), అజయ్ దేవగన్(Ajay Devgn) తాజాగా తమ రెమ్యూనరేషన్‌పై ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తాము ఒక సినిమాకు రెమ్యూనరేషన్ ఎలా తీసుకుంటారో తెలిసి అభిమానులు షాక్ అయ్యారు. ఏందయ్యా ఇది.. మేమెక్కడా చూడలా అన్న రేంజ్‌లో రియాక్షన్ ఇస్తున్నారు. ఈ సందర్భంగానే ఒక సినిమాకు పారితోషికం అనేది స్క్రిప్ట్, కథలో ప్రాధాన్యతను బట్టి తీసుకోవాలని అక్షయ్ అభిప్రాయపడ్డారు. ‘‘ప్రస్తుతం చాలా మంది హీరోలు సినిమాకు వచ్చే లాభాల్లో వాటా కోసం ఒప్పందాలు చేసుకుంటున్నారు. వాళ్లలో నేను కూడా ఒకడిని.
ఈ క్రమంలో సినిమా అనుకున్న స్థాయిలో రాణించనిపక్షంలో నిర్మాతకు సరైన రిటర్న్స్ రావు. అలాంటి సమయాల్లో హీరో తన పూర్తి పారితోషికాన్ని వదులుకోవాల్సి ఉంటుంది. ఇలా చేయడానికి సినీ పరిశ్రమపై ఉండే మక్కువే కారణం. ఇలా చేసుకున్నప్పుడు సినిమా ఎంత అద్భుతంగా పర్ఫార్మ్ చేస్తే అంత ఎక్కువ రెమ్యూనరేషన్ వస్తుంది. అదే విధంగా సినిమా ప్లాప్ అయితే పారితోషికం ఏమీ ఉండదు. నిర్మాత లాభాల్లో ఉన్నప్పుడు మేము వాటా తీసుకుంటాం. ఇలా చేయడం వల్ల నిర్మాత సేఫ్‌గా ఉంటారు. అదే సినిమా ఫెయిల్ అయితే మాత్రం నిర్మాతతో పాటు మాకు నష్టాలు తప్పవు’’ అని అక్షయ్(Akshay Kumar) వివరించాడు.
‘‘నేను కూడా అంతే నేను నటించిన సినిమా ఫ్లాప్ అయితే రెమ్యూనరేషన్ తీసుకోను. సినిమాకు వచ్చిన కలెక్షన్లను బట్టే నా పారితోషికం ఉంటుంది. దక్షిణ భారత చలచిత్ర పరిశ్రమతో పోలిస్తే బాలీవుడ్‌లో అంత ఐక్యత లేదు. సౌత్ ఇండస్ట్రీ తమ నటీనటులకు మద్దతుగా నిలుస్తుంది. ఇక్కడ అలా కాదు. అందుకే నిర్మాతలను కష్టాల్లోకి నెట్టకుండా ఉండటానికే నేను ప్రిఫవర్ చేస్తాను. దాంట్లో భాగంగానే నేను రెమ్యూనరేషన్ విషయంలో ఇలాంటి నిర్ణయం తీసుకున్నా. సినిమా ప్లాప్ అయిందంటే రూపాయి రెమ్యూనరేషన్ కూడా తీసుకోను’’ అని అజయ్ దేవగన్ వెల్లడించాడు.