Paagal Vs Kaadhal | యూత్ ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్ మూవీస్‌కు ఎప్పుడూ గిరాకీ ఉంటుంది. టైటిల్ మొదలు కథ నడిపించే తీరు అంతా సినిమాను హిట్ చేయడంలో కీలకంగా ఉంటాయి. లవ్ సినిమా అంటే కాస్తంత దృష్టి పెడితే చాలు ప్రేక్షకులు హిట్ చేసేస్తారు. అలాంటిది టైటిల్‌తోనే అందరి దృష్టిని ఆకర్షించిన సినిమా ‘పాగల్ వర్సెస్ కాదల్’. నటీనటులు ఎక్కువ మంది కొత్తవారే అయినా.. ఆ ఫీల్ ఎక్కడా కనిపించలేదు. ఈ సినిమా ఎలా ఉందంటే..
కథేంటంటే
ఎవరో ఒక వ్యక్తి తాగి న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నాడనే కంప్లైంట్ రావడంతో అతని దగ్గరకు వెళ్తారు పోలీస్ కానిస్టేబుల్ రామ్ ప్రసాద్ (షకలక శంకర్), ఎస్ఐ (బ్రహ్మాజీ). తాగిన వ్యక్తి పేరు ప్రసాద్. పోలీసుల అతని బాధకు కారణమేంటని అడుగుతారు. దాంతో ఆ కథ తనది కాదని, తన ఫ్రెండ్ స్టోరీ చెప్పడం ప్రారంభిస్తాడు. ఆ ఫ్రెండ్ పేరు కార్తీక్ (విజయ్ శంకర్). కార్తీక్ సివిల్ ఇంజినీర్ గా పనిచేస్తుంటాడు. ప్రియ (విషిక) అనే అమ్మాయిని చూసి లవ్ చేస్తాడు. కానీ విషిక సైకోలా బిహేవ్ చేస్తుంటుంది. కార్తీక్ తనను ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలుసుకునేందుకు టెస్ట్ చేస్తుంటుంది. ప్రియ చేసే పనులన్నీ భరిస్తూ ఆమెను ప్రేమిస్తుంటాడు కార్తీక్. ప్రియ బ్రదర్ మనోజ్ ఒక సైకియాట్రిస్ట్. అతన్ని లవ్ చేస్తుంది కార్తీక్ సోదరి అమృత. కానీ అమృత లవ్ ను మనోజ్ యాక్సెప్ట్ చేయడు. అతనిది కూడా సైకో మైండ్ సెట్. తనే అందరికన్నా గొప్పవాడని ఫీలవుతుంటాడు. ఇన్నోసెంట్ కార్తీక్, అతని సోదరి అమృత, సైకో మైండ్ సెట్స్ ఉన్న ప్రియ, ఆమె బ్రదర్ మనోజ్ ప్రేమలో ఎలా ఒక్కటయ్యారు అనేది మిగిలిన కథ.
మెసేజ్‌ను క్యారీ చేసింది
యూత్ ఫుల్ లవ్ స్టోరీస్ చూసేందుకు ప్రేక్షకుల ఎప్పుడూ రెడీగా ఉంటారు. వారికి కావాల్సిందల్లా కాసేపు ఎంటర్ టైన్ చేయడమే. ఆ ప్రేమ కథ ఎలా ఉన్నా వినోదాన్ని అందిస్తే చాలు హిట్ అయినట్లే. అలాంటి ఎంటర్ టైన్ మెంట్ పాగల్ వర్సెస్ కాదల్ పుష్కలంగా అందించింది. ఈ కథలోని కార్తీక్, ప్రియ, అమృత, మనోజ్ అనే నాలుగు మెయిన్ క్యారెక్టర్స్ ను వేటికవి భిన్నంగా డిజైన్ చేశాడు దర్శకుడు రాజేశ్. వారి క్యారెక్టర్స్ లోని కొత్తదనమే సినిమాను ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా మార్చింది. కార్తీక్ ఫ్రెండ్ ప్రసాద్ క్యారెక్టర్ కమెడియన్ సునీల్ క్యారెక్టర్ లా మూవీ అంతా ఎంటర్ టైన్ చేస్తుంది. ప్రేమ కథల్లో ఓ భిన్నమైన ప్రయత్నమిది. ఇవాళ్టి జనరేషన్ లవర్స్ బాగా కనెక్ట్ అయ్యేలా తీర్చిదిద్దాడు దర్శకుడు. కొందరు అమ్మాయిలు అబ్బాయిలు తమనే ప్రాణంగా చూసుకోవాలని, తమకంటే ప్రపంచంలో ఏదీ ఎక్కువ కాదనేట్లు బిహేవ్ చేయాలని కోరుకుంటారు. ఈ క్రమంలో శాడిజం చూపిస్తుంటారు. ఆ శాడిజం భరించేవరకు బాగానే ఉంటుంది. ఈ కథకు మూలమైన పాయింట్ కూడా అదే. ప్రేమకు నమ్మకం ఉండాలి కానీ అనుమానం కాదు అనే మంచి మెసేజ్ కూడా పాగల్ వర్సెస్ కాదల్ మూవీలో ఉంది.
ఎవరెలా చేశారంటే
కార్తీక్ పాత్రలో విజయ్ శంకర్ పర్ ఫార్మెన్స్ హైలైట్ అని చెప్పొచ్చు. ఇన్నోసెంట్ అబ్బాయిగా, ప్రేయసి ఎన్ని బాధలు పెట్టినా ప్రేమతో భరించే పాత్రలో ఆకట్టుకునేలా నటించాడు విజయ్ శంకర్. అతను ఇంకా ఎన్నో డెప్త్ ఉన్న క్యారెక్టర్స్ చేయగలడనే నమ్మకాన్ని ఇస్తుందీ సినిమా. ఇక ప్రియ పాత్రలో విషిక సైకోయిజాన్ని పీక్స్ లో చూపించింది. ఆఖరికి చేతబడి కూడా నేర్చుకోవడం ఆమె క్యారెక్టర్ లోని శాడిజానికి బెస్ట్ ఎగ్జాంపుల్. అమృతగా అనూహ్య సారిపల్లి ఆకట్టుకుంది. చెల్లి అంటే ఇలాగే ఉంటుందా అనిపించింది. శాడిస్ట్ సైకియాట్రిస్ట్ గా మనోజ్ పాత్రలో మెప్పించాడు ప్రశాంత్.
ప్రవీణ్ మ్యూజిక్ చాలా బాగుంది. బీజీఎం కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుంది. సైకో సైకస్య సైకోభ్యహా అనే హుక్ లైన్ తో వచ్చే బీజీఎం థియేటర్స్ లో విజిల్స్ వేయించింది. కంటిలోన పాపలా సాంగ్ మంచి మెలొడీ. నవధీర్ సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాత పడ్డాన మన్మధరావు సినిమాకు కావాల్సిన ప్రొడక్షన్ వ్యాల్యూస్ అందించి కథను మరింత ఎలివేట్ అయ్యేలా చేశారు. దర్శకుడు రాజేశ్ ముదునూరి పెళ్లి చూపులు టైమ్ ఒక హిలేరియస్ లవ్ అండ్ ఎంటర్ టైనర్ మూవీ చేశాడు. ఫన్ అండ్ రిలాక్స్ కోసం పాగల్ వర్సెస్ కాదల్ చూసి స్ట్రెస్ ఫ్రీ అవొచ్చు
ఫ్లస్ పాయింట్స్
విజయ్ శంకర్ యాక్టింగ్
ఫన్ అండ్ ఎంటర్ టైన్ మెంట్
డైలాగ్స్, డైరెక్షన్
మైనస్ పాయింట్స్
కొన్ని లాజిక్ లేని సీన్స్
Paagal Vs Kaadhal | నటీనటులు – విజయ్ శంకర్, విషిక, బ్రహ్మాజి, షకలక శంకర్, ప్రశాంత్ కూఛిబొట్ల, అనూహ్య సారిపల్లి, ఆద్విక్ బండారు, తదితరులు
టెక్నికల్ టీమ్ – ఎడిటింగ్, డీఐ – శ్యామ్ కుమార్.పి., సినిమాటోగ్రఫీ – నవధీర్, మ్యూజిక్ – ప్రవీణ్ సంగడాల, బ్యానర్ – శివత్రి ఫిలింస్, నిర్మాత – పడ్డాన మన్మథరావు, రచన, దర్శకత్వం – రాజేశ్ ముదునూరి
రేటింగ్ 3/5