Ali | కమెడియన్ అలీకి నోటీసులు.. ఎందుకంటే..

-

టాలీవుడ్‌లోని ప్రముఖ హాస్యనటుల్లో అలీ(Ali) ఒకరు. తన హాస్యంతో ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు పొందాడు. కానీ కొంతకాలంగా ఆయన పెద్దగా సినిమాలు చేయడం లేదు. మరి అవకాశాలు రాకనో, చేయాలన్న ఇంట్రస్ట్ లేకనో ఆయన సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు. అయితే తాజాగా ఆయనకు వికారాబాద్ జిల్లా నవాబ్‌పేట మండలం ఎక్‌మామిడి(Ekmamidi) గ్రామ పంచాయతీ నోటీసులు జారీ చేసింది. అనుమతులు లేకుండా ఫామ్‌హౌస్ నిర్మాణాలు చేస్తున్నారంటూ అందులో పేర్కొంటూ గ్రామ పంచాయతీ కార్యదర్శి శోభారాణి ఆయనకు నోటీసులు జారీ చేశారు. తక్షణమే భవన నిర్మాణాలు ఆపేయాలని కూడా సూచించారు.

- Advertisement -

ఎక్‌మామిడి రెవెన్యూ పరిధి సర్వే నెంబర్ 345లో ఫామ్‌హౌస్ నిర్మాణాలు జరుగుతున్నాయి. వాటికి సంబంధించిన పత్రాలను సమర్పించి అవసరమైన అనుమతులు తీసుకోవాలంటూ గతంలో అలీకి నోటీసులు ఇచ్చారు అధికారులు. అయినా ఆయన(Ali) స్పందించకపోవడంతో తాజాగా రెండోసారి నోటీసులను జారీ చేశారు. ఈసారి కూడా నోటీసులను నిర్లక్ష్యం చేస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Read Also: ఆహారాన్ని వేగంగా తినేస్తున్నారా.. ప్రమాదంలో పడినట్లే..!
Follow US: Google News, Twitter, Share Chat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Manmohan Singh | మన్మోహన్ సింగ్ వ్యక్తిగత, రాజకీయ ప్రస్థానం…

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) 1932 సెప్టెంబర్ 26న...

PM Modi | మన్మోహన్ సింగ్ మృతిపై ప్రధాని మోదీ ఎమోషనల్

కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై...