పాపం రాజమౌళి నిర్మాత అలా బుక్ అయ్యాడు…

పాపం రాజమౌళి నిర్మాత అలా బుక్ అయ్యాడు...

0
83

కరోనా కారణంగా షూటింగ్ లు అన్ని నిలిచి పోయిన సంగతి తెలిసిందే… ఇటీవలే కేంద్రం షరతులతో కూడిన పర్మీషన్ ఇవ్వడంతో కొంత మంది షూటింగ్ ను మొదలు పెడుతున్నారు… మరికొందరు కరోనా భయంతో షూటింగ్ కి రెడి అవ్వకున్నారు… ఈ క్రమంలో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న చిత్రం ఆర్ ఆర్ ఆర్…

ఈ చిత్రం షూటింగ్ కూడా దసరా తర్వాత స్టార్ట్ చేస్తారని వార్తలు వస్తున్నాయి… తాజాగా సమాచారం ప్రకారం ఆర్ ఆర్ ఆర్ చిత్రం నిర్మాత కరోనా వల్ల నానా అగసాట్లు పడుతున్నారని వార్తలు వస్తున్నాయి… షూటింగ్ రీ స్టార్ట్ చేయడానికి సిద్దంగా ఉన్నా కూడా నిర్మాత దానయ్య సంతోషంగా లేరని వార్తలు వస్తున్నాయి…

కరోనా కు ముందే అల్యూమీనియంతో భారీ సెట్స్ నిర్మించారు… ఇప్పుడు షూటింగ్ మొదలు పెట్టినా అదే సెట్స్ లో షూటింగ్ చేయాలి… ప్రస్తుతం ఆ భారీ సెట్స్ పాడైపోయాయని అంటున్నారు… అల్యూమీనియం ఫ్యాక్టరీ ని 20 కోట్లతో నిర్మించారు ఇప్పుడు షూటింగ్ మొదలు పెట్టాలంటే మళ్లీ దానికి అదనపు ఖర్చు అవడంతో దానయ్య బెంగపెట్టుకున్నాడట…