ఈ మధ్య సినీ ఇండస్ట్రీలో బిగ్ హిట్ అయిన లిస్టులో సీతారామం ఒకటి. అద్భుతమైన ప్రేమకావ్యంగా తెరకెక్కిన సీతారామంలో దుల్కర్ సల్మాన్, మణాల్ ఠాకూర్ జంటగా నటించారు. ఈ సినిమాకు హను రాఘవపూడి దర్శకత్వం వహించారు. రష్మిక మందన్నా, సుమంత్, తరుణ్ భాస్కర్ కీలక పాత్రల్లో మెప్పించారు.
యుద్ధంతో రాసిన ఈ ప్రేమ కథకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ సినిమాకు చేసిన ప్రమోషన్స్ తక్కువే అయిన ప్రేక్షకులు భారీ హిట్ ను ఇచ్చారు. ఇక తాజాగా ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఈ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.యుద్ధంతో కూడిన ప్రేమకథ విశేషంగా ఆకట్టుకుంది. ఆద్యంతం విషాదంతంతో కూడడం ఈ సినిమా భిన్నమైందిగా నిలిచిపోయింది.
సాధారణంగా సగటు ప్రేక్షకుడు ఆశించే సుఖాంతానికి తావివ్వకుండా, దర్శకుడు సినిమాని విషాదాంతంగా ముగించాడు. అయితే క్లైమాక్స్‌లో వాళ్లిద్దరూ కలిసినట్లు సినిమాని మార్చి ఉంటే వేరే లెవెల్లో ఉండేదని, హీరో పాత్రను ప్రశ్నార్థకంగా ముగించేయడం ప్రేక్షకులను కంటతడి పెట్టించిందని ఆయన తెలిపారు.