పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ – పీపుల్ మీడియా ఫ్యాక్టరీ – భారీ డీల్

పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ - పీపుల్ మీడియా ఫ్యాక్టరీ - భారీ డీల్

0
105

ఓపక్క హీరోలు ఇటు సినిమాలు చేస్తూ చిత్ర నిర్మాణంలో కూడా బిజీగా ఉంటున్నారు, టాలీవుడ్ బాలీవుడ్ లో చాలా మంది హీరోలు ఈ మధ్య ఇలా నిర్మాణంలో కూడా భాగస్వాములు అవుతున్నారు… ఇక పవన్ కల్యాణ్ కూడా ఇదే ఆలోచనతో ఉన్నారు.ఒక వైపున హీరోగా తన సినిమాలు చేసుకుంటూనే, నిర్మాతగానూ పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ ను స్థాపించారు.

కొత్త దర్శకులని ప్రొత్సహిస్తూ తన అభిరుచికి తగిన కధలు వస్తే ఆ సినిమాలు తీయాలి అని ఆలోచనతో దీనిని స్ధాపించారు.

 

 

ఇక టాలీవుడ్ లో ఇప్పుడు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పేరు కూడా బాగా వినిపిస్తోంది, సరికొత్త సినిమాలు నిర్మిస్తున్నారు, అయితే తాజాగా పవన్ కల్యాణ్ తో ఈ సంస్ధ చేతులు కలిపింది, ఈ రెండు బ్యానర్ల మధ్య తాజాగా ఒక భారీ డీల్ కుదిరింది. ఆ డీల్ ప్రకారం ఈ రెండు బ్యానర్లు కలిసి వరుసగా 15 సినిమాలు నిర్మించనున్నాయి.

 

 

కొత్త కధలతో వచ్చే దర్శకులతో సినిమాలు తీయనున్నారట.తక్కువ బడ్జెట్ లో 6 సినిమాలను .. ఓ మాదిరి బడ్జెట్ లో 6 సినిమాలను .. 3 భారీ చిత్రాలను నిర్మించాలని నిర్ణయించుకున్నారు. కథారచయితలను యువ దర్శకులని ప్రొత్సహిస్తాము అని అంటున్నారు. ఇక త్వరలో తమ ప్రాజెక్టులకి సంబంధించి విషయాలు తెలియచేస్తాము అంటున్నారు.