పవన్ క్రిష్ సినిమాకి హీరోయిన్ ఫిక్స్

పవన్ క్రిష్ సినిమాకి హీరోయిన్ ఫిక్స్

0
103

పవన్ కల్యాణ్ ఇక సినిమాలు చేయరు అని భావించిన వారికి అందరికి పవన్ కల్యాణ్ మళ్లీ సినిమాలు చేస్తున్నాను అని చెప్పడం వరుసగా సినిమాలు ఒప్పుకోవడంతో అభిమానుల ఫుల్ జోష్ మీద ఉన్నారు. వరుసగా మూడు సినిమాలు ఒకే చేశారు పవన్.. అంతే కాదు అన్నీచిత్రాలకు కథ రెడీ అయ్యాయి.. రెండు చిత్రీకరణ స్టార్ట్ అయ్యాయి.

ఇంకా ఆయనతో సినిమా చేసేందుకు దర్శకులు క్యూ కడుతున్నారు.. అయితే వచ్చే ఏడాది వరకూ పవన్ సినిమాలతో ఫుల్ బిజీ అనే చెప్పాలి. పింక్ రీమేక్ వకీల్సాబ్ అనే టైటిల్ వినిపిస్తోంది, క్రిష్ కూడా పవన్ తో సినిమా క్లాప్ కొట్టేశారట.. ఈ చిత్రానికి క్రిష్ ఈ సినిమాకి విరూపాక్ష అనే టైటిల్ను అనుకుంటున్నట్లు వార్తలు వినపడుతున్నాయి.

ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అయితే పవన్ సరసన మహానటిలో హీరోయిన్ కీర్తి సురేష్ నటిస్తారు అని వార్తలు వినిపిస్తున్నాయి .. ఇటీవల ఈ సినిమా గురించి చర్చలు జరిగాయట.. ఆమెకి కథ నచ్చడంతో ఒకే చెప్పింది అని తెలుస్తోంది…గతంలో పవన్ కల్యాణ్తో అజ్ఞాతవాసి చిత్రంలో కీర్తిసురేశ్ నటించింది.