ప‌వ‌న్ కు బ‌‌ర్త్ డే గిఫ్ట్ రెడీ చేస్తున్న రామ్ గోపాల్ వ‌ర్మ ? ఏమిటంటే

ప‌వ‌న్ కు బ‌‌ర్త్ డే గిఫ్ట్ రెడీ చేస్తున్న రామ్ గోపాల్ వ‌ర్మ ? ఏమిటంటే

0
112

కాంట్ర‌వర్శీల‌తో బిజీగా ఉంటారు రామ్ గోపాల్ వ‌ర్మ , స‌మాజంలో ఏదైనా పెద్ద ఇష్యూ జ‌రిగితే వెంట‌నే దానిపై సినిమా తీసేందుకు సిద్ద‌మ‌వుతూ ఉంటారు, వివాదాల‌తోనే ఆయ‌న సావాసం చేస్తారు, అయితే ఇలాంటి ఎన్నో చిత్రాలు తెర‌కెక్కించారు వ‌ర్మ‌.

తాజాగా ఆయన పవర్ స్టార్ పేరుతో ఓ సినిమాను తీస్తానని ప్రకటించాడు. అంతేకాకుండా ఆ సినిమాలో నటించబోయే హీరో కి సంబందించిన ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు…ఇతడే నా పవర్ స్టార్..ఈ వీడియో చూసాక మీకు ఎవరైనా గుర్తుకు వస్తే అది మీ ఊహకే వదిలేస్తున్నా అని చివ‌ర‌న అన్నారు.

అయితే ప‌వ‌న్ రూపురేఖ‌ల‌తోనే అత‌ను ఉన్నాడు, సేమ్ ప‌వ‌న్ అనే అర్ధం అవుతోంది, సేమ్ ప‌వ‌ర్ స్టార్ లా వాకింగ్ ఉంది, తాజాగా మ‌రో ప్ర‌క‌ట‌న చేశారు ఆర్జీవీ..పవర్ స్టార్ సినిమాను పవన్ కళ్యాణ్ పుట్టిన రోజునే విడుదల చేయాలని నిర్ణయించుకున్నాడట. సెప్టెంబర్ 2న పవన్ పుట్టినరోజు ఆరోజు రిలీజ్ చేస్తార‌ట చిత్రం..‌. దీనిపై ప‌వ‌న్ ఫ్యాన్ అప్పుడో ట్రోల్స్ స్టార్ట్ చేస్తున్నారు.