టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 3 సంవత్సరాల తర్వాత సినిమా చేస్తున్నారు, వకీల్ సాబ్ గా వెండితెరపై వస్తున్నారు, అయితే వకీల్ సాబ్ సినిమా గురించి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.. ఇక తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఎంతో సక్సస్ అయింది.. పవన్ కళ్యాణ్ ఈ ఈవెంట్లో ఒక స్పెషల్ ఉంగరం ధరించడం హాట్ టాపిక్ గా మారింది.
అయితే ఆయన ఈ ఉంగరం ఎందుకు ధరించారు అనే దాని గురించి అభిమానులు తెగ చర్చించుకుంటున్నారు… మొత్తానికి ఈ ఫంక్షన్ లో ఆయన స్పీచ్ విన్న ప్రతీ ఒక్కరు ఆయన చేతి వేలికి ఉన్న ఉంగరం గురించి మాట్లాడుకున్నారు.
పవన్ కళ్యాణ్ వేలికి ఉన్న ఉంగరం ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అయితే ఆయన సెంటిమెంట్ కోసం పెట్టుకున్నారా లేక మరేదైనా కారణముందో అని మాట్లాడుకుంటున్నారు, ముఖ్యంగా ఇప్పుడు క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా చేస్తున్న పవన్ అందులో పాత్ర కోసం ఇది ధరించారు అనే వార్తలు వినిపిస్తున్నాయి…పడగా విప్పిన నాగుపాము ఆకారంలో ఉన్న ఉంగరం స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.