దిల్ రాజుకి ఫైనల్ గా చెప్పేసిన పవన్ 21 రోజులు మాత్రమే

దిల్ రాజుకి ఫైనల్ గా చెప్పేసిన పవన్ 21 రోజులు మాత్రమే

0
85

పవన్ కల్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉన్నా ఓ సినిమా మాత్రం చేసి మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వాలి అని చూస్తున్నారు… ఇంకా ప్రకటన రావడం లేదు కాని పింక్ అనే సినిమా ఆయన చేయబోతున్నారు.
తాజాగా టాలీవుడ్ పింక్ సినిమా గురించి ఓ ఇంట్రస్టింగ్ అప్ డేట్ తెలిసింది. పవన్ ఈ చిత్రం కోసం కేవలం 21 రోజులు మాత్రమే కేటాయించారట.

మొత్తానికి ఆయనకు ఉన్న షెడ్యూల్ ప్రకారం కేవలం 21 రోజుల్లో తన షూటింగ్ పార్ట్ ను పూర్తి చేసేలా ప్లాన్ చేసుకోమని దర్శకనిర్మతాలకు చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. వేణుశ్రీరామ్ దర్శకత్వం ఫైనల్ అయింది అని తెలుస్తోంది. బోనీకపూర్ దిల్ రాజు సంయుక్తంగా నిర్మాతలుగా చేయనున్నారు ఈ చిత్రం.

అయితే పవన్ కల్యాన్ మాత్రం తన షూటింగ్ నెలల పాటు కుదరదు అని, రాజకీయంగా ఉన్నాను కాబట్టి అతి తక్కువ కాల్ షీట్లు ఇస్తున్నాని చెప్పారట. అందుకే దిల్ రాజు కూడా దానికి తగ్గా ప్లాన్ వేస్తున్నారు, ఇక బాణీలు థమన్ ఇవ్వనున్నారు .. ఇప్పటికే చిత్రానికి ప్రధాన అంశం అయిన ముగ్గురు అమ్మాయిల పాత్రల కోసం.. అంజలి, నివేదా థామస్ మరియు అనన్యలను తీసుకోవాలని ఫిక్స్ అయ్యారనే విషయం తెలిసిందే.