ప‌వ‌న్ సినిమాలో ఆ హీరోయిన్ ఛాన్స్ కొట్టేస్తోందా.

ప‌వ‌న్ సినిమాలో ఆ హీరోయిన్ ఛాన్స్ కొట్టేస్తోందా.

0
114

ప‌వ‌న్ రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన త‌ర్వాత ఫుల్ బిజీ అయ్యారు ..దీంతో సినిమాలు ప‌క్క‌న పెట్టారు అయితే తాజాగా ఆయ‌న మ‌ళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు.. వ‌కీల్ సాబ్ సినిమా చేస్తున్నారు.. అలాగే ద‌ర్శ‌కుడు క్రిష్ తో మ‌రో సినిమా చేస్తున్నారు.. ఇలా దాదాపు నాలుగు సినిమాలు ఆయ‌న లైన్ లో పెట్టారు.

అయితే ఇప్పుడు తాజా చిత్రం వకీల్‌సాబ్ బాలీవుడ్ హిట్ చిత్రం పింక్‌ ఆధారంగా రూపొందుతోంది అనేది తెలిసిందే.ఈ సినిమాకి శ్రీరామ్ వేణు దర్శకత్వం వ‌హిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ ఎవ‌రు న‌టిస్తారు అనేది బ‌య‌ట‌కు ఇంకా రాలేదు.

ముందు శృతిహాసన్ నటిస్తుందని ఇటీవల ప్రచారం జరిగింది. అయితే తాను ఈ చిత్రంలో నటించడం లేదని శృతిహాసన్ ప్రకటించడంతో తాజాగా ఇలియానా పేరు వినిపిస్తోంది.గ‌తంలో ఇలియానాతో ప‌వ‌న్ జ‌ల్సా చేశారు, అయితే తాజాగా ఆమె ఈ సినిమాలో న‌టిస్తోంది అని ప్ర‌చారం మ‌ళ్లీ షురూ అయింది, త్వ‌ర‌లో దీనిపై క్లారిటీ అయితే రానుంది.