పవన్ సినిమాలో యాంకర్ అనసూయ రోల్ ఏమిటంటే

పవన్ సినిమాలో యాంకర్ అనసూయ రోల్ ఏమిటంటే

0
115

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తాజాగా పింక్ సినిమా చేస్తున్నారు… ఈ సినిమాకి సంబంధించి మూడు నెలలుగా వర్క్ అనేది స్టార్ట్ అయింది… అయితే ఇటీవలే షూటింగ్ అయితే ప్రారంభించారు… పవన్ కూడా షూటింగ్ లో పాల్గొంటున్నారు, అయితే పవన్ కల్యాణ్ తరువాత క్రిష్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు అనేది తెలిసిందే.

వరుసగా ఈ సినిమా కూడా సెట్స్ పైకి వెళ్లింది, అయితే ఈ సినిమాలో ఇప్పటికే చాలామంది నటీ నటులని ఫైనల్ చేశారట దర్శకుడు క్రిష్… తాజాగా ఈ చిత్రంలో యాంకర్ అనసూయకి కూడా ఓ పాత్ర ఇచ్చారు అని తెలుస్తోంది..
ఇప్పటికే రంగస్థలంలో రంగమ్మత్త పాత్ర ఆమెకు మంచి పేరు తెచ్చింది.

ఇక మరో మెగాహీరో పవర్ స్టార్ సినిమాలో ఆమెకు ఎలాంటి రోల్ ఇస్తారు అనేది టాక్ నడుస్తోంది.. అయితే ఈ సినిమాలో ఆమె పాత్ర చాలా కీలకమైనది అని చెబుతున్నారు.. పవన్ కు బంధువుగా ఉండే పాత్ర ఇందులో ఆమె చేయనున్నారట.. ఈ పాత్రకి ఆమె ఒకే చెప్పారట.. ఈ సినిమాలో బందిపోటు పాత్రలో పవన్ కల్యాణ్ కనిపించనుండగా, ఆయన సరసన ప్రగ్యా జైస్వాల్ పేరు వినిపిస్తోంది.