ప‌వ‌న్ సినిమాలో ఆ పాత్ర కోసం తెర‌పైకి న‌లుగురి పేర్లు

ప‌వ‌న్ సినిమాలో ఆ పాత్ర కోసం తెర‌పైకి న‌లుగురి పేర్లు

0
92

సినిమాల్లో మ‌ళ్లీ రీ ఎంట్రీ ఇచ్చారు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్, మొత్తానికి ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమాలు వ‌రుస‌గా అనౌన్స్ చేయ‌డంతో అభిమానులు చాలా ఆనందంలో ఉన్నారు, అయితే దాదాపు వ‌చ్చే ఏడాది చివ‌రి వ‌ర‌కూ ఆయ‌న‌కు వ‌రుస‌గా సినిమాలు ఉన్నాయి, సెట్స్ పై రెండు ఉంటే ఇక ఫైన‌ల్ అయిన చిత్రాలు మ‌రో మూడు ఉన్నాయి.

అయ్యప్పనుమ్ కోషియమ్ అనే మ‌ళ‌యాల చిత్ర క‌ధ‌ను తెలుగులో రీమేక్ చేయ‌నున్నారు. ఇక ఈ సినిమాలో మ‌రో కీల‌క పాత్ర ఉంది, అందుకే ఈ పాత్ర కోసం చాలా మంది పేర్లు ప‌రిశీల‌న చేస్తున్నారు, మ‌రీ ముఖ్యంగా సుదీప్ పేరు వినిపించింది, ఇటీవ‌ల ప‌వ‌న్ ని క‌ల‌వ‌డంతో ఇది వాస్త‌వం అని అంద‌రూ అనుకున్నారు ఈ వార్త టాలీవుడ్ లో వినిపించింది.

తాజాగా మ‌రో పేరు వినిపిస్తోంది..ప్రముఖ తమిళ నటుడు విజయ్ సేతుపతి ఈ పాత్ర పోషించే అవకాశం ఉందని తెలుస్తోంది, అంతేకాదు ఇప్ప‌టికే ఈ పాత్ర గురించి టాలీవుడ్ లో రానా, అలాగే నితిన్ పేర్లు వినిపించాయి, మ‌రి ఎవ‌రిని తీసుకుంటారో చూడాలి.