పవన్ ఫాన్స్ మెచ్చేలా చిరు సరికొత్త నిర్ణయం..!!

పవన్ ఫాన్స్ మెచ్చేలా చిరు సరికొత్త నిర్ణయం..!!

0
91

చిరంజీవి కొరటాల శివ సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడు.. ఇప్పటికే మేక్ ఓవర్ విషయంలో తుది మెరుగులు దిద్దుకుంటున్న చిరు సినిమాలోంచి మరొక అప్ డేట్ బయటకు వచ్చింది.. సోషియా ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రం దేవాదాయ శాఖలో జరిగిన అవినీతి నేపథ్యంలో రూపొందనున్నట్టు సమాచారం.

సంక్రాంతి తర్వాత ప్రారంభం కానున్న ఈ చిత్రంలో చిరు నక్సలైట్ పాత్రలో కనిపించనున్నారట. త్రిష ఈ చిత్రంలో చిరుతో జోడీ కడుతుందని టాక్. మెలోడీ బ్రహ్మ మణిశర్మ చిత్రానికి సంగీతం అందించనున్నారు.

ఈ సినిమా ని మెగా పవర్‌ స్టార్‌ రామ్ చరణ్‌ కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ బ్యానర్‌పై నిర్మిస్తున్నాడు. మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ కూడా ఇందులో భాగం కానుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి.