తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాలకు కాస్త విరామం ప్రకటించి అభిమానులను అలరించేందుకు సిద్దమైన సంగతి తెలిసిందే అందులో భాగంగా మొదటగా వకీల్ సాబ్ మూవీ చేస్తున్నాడు పవన్… కరోనా రాకుంటే ఈ చిత్రం ఎప్పుడో విడుదల అయ్యేది కానీ కరోనా కారణంగా ఇంకా షూటింగ్ కూడా పూర్తి చేసుకోలేదు…
ప్రస్తుతం అందుతున్న తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉందని అంటున్నారు… ఇక ఆ తర్వాత పవన్ క్రిష్ దర్శకత్వంలో, హరీష్ దర్శకత్వంలో, సాగర్ కే చంద్ర దర్శకత్వంలో, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సినిమాలు చేస్తున్నాడు… ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది… అయితే ఇప్పుడు పవన్ మరో చిత్రానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వార్తలు వస్తున్నాయి…
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తో ఒక మూవీ చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి… ఇటీవలే జానీ మాస్టర్ కథను పవన్ కు వినిపించారట… ఈకథ పవన్ కు నచ్చడంతో ఒకే చెప్పారట… అలాగే చరణ్ కు కూడా కథను వినిపించారట జానీ మాస్టర్… దీంతో చిత్రాన్ని చరణ్ నిర్మించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వార్తలు వస్తున్నాయి… అయితే ఈ చిత్రానికి సంబంధించి అధికారిక ప్రకటన రాలేదు… త్వరలో వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు…