జనసేన అధినేత పవన్ కల్యాణ్ బర్త్ డే రోజు విషాద ఘటన జరిగింది, అభిమానులు పుట్టిన రోజు గ్రాండ్ గా చేయాలి అని భావించారు, చిత్తూరు జిల్లా శాంతిపురంలో పవన్ అభిమానులు బర్త్ డే బ్యానర్‌లు కడుతున్న సమయంలో ఏడవ మైల్ వద్ద ఫ్లెక్సీలు కడుతుండగా ఐదు మంది విద్యుత్ షాక్ తగిలింది. విద్యుదాఘాతంలో ముగ్గురు పవన్ కల్యాణ్ అభిమానులు సోమశేఖర్, రాజేంద్ర, అరుణాచలం మరణించారు
దీంతో ఆ ప్రాంతంలో విషాదం నెలకొంది, ఈ విషయం వెంటనే పవన్ అభిమానులకి తెలిసింది అందరూ అక్కడకు చేరుకున్నారు మరో ఇద్దరు హరికృష్ణ, పవన్, సుబ్రమణ్యంకు తీవ్ర గాయాలు కావడంతో వారికి చికిత్స అందిస్తున్నారు..మృతుల్లో ఇద్దరు అన్నాదమ్ముళ్లు ఉన్నారు.
ఈ ఘటనపై పవన్ కల్యాణ్ స్పందించారు. గుండెల నిండా తనపట్ల అభిమానం నింపుకున్న ముగ్గురు యువకులు విద్యుత్ షాక్‌తో మరణించడం దిగ్భ్రాంతికి గురిచేసిందని పవన్ అన్నారు, ఆ తల్లిదండ్రుల బాధని అర్దం చేసుకోగలను, వారికి నేను బిడ్డగా నిలుస్తాను అన్నారు పవన్.ఆర్థికంగా ఆ కుటుంబాలను తానే ఆదుకుంటానని చెప్పారు పవన్ కల్యాణ్. అక్కడ గాయపడిన వారికి వెంటనే సాయం అందించాలని జిల్లా నాయకులకి తెలిపారు పవన్ కల్యాణ్.