పవన్ ఎప్పుడు ఆ ట్రైన్ ఎక్కుతారు?

పవన్ ఎప్పుడు ఆ ట్రైన్ ఎక్కుతారు?

0
99

టాలీవుడ్ హీరోలు అందరూ ఇప్పుడు తెలుగులోనే కాదు ఏకంగా బాలీవుడ్ లో నేరుగా సినిమాలు చేస్తున్నారు, మూడు వందల కోట్లు 500 కోట్ల బడ్జెట్ సినిమాలు చేస్తున్నారు, అయితే ఈ జాబితాలో చెప్పుకుంటే ప్రభాస్ ముందు వరసలో ఉన్నారు, అలాగే ఇప్పుడు రామ్ చరణ్ ఎన్టీఆర్ కూడా ఆర్ ఆర్ ఆర్ సినిమాతో ఈ ట్రాక్ లో ఉన్నారు.

ఇక పుష్ప సినిమాతో అల్లు అర్జున్ కూడా పాన్ ఇండియా కి వెళుతున్నారు. తాజాగా మహేష్ సర్కారు పాట కూడా బాలీవుడ్ ని చుట్టెయ్యబోతుంది, మరి మన వకీల్ సాబ్ అదే మన పవన్ కల్యాణ్ ఎప్పుడు ఈ గుడ్ న్యూస్ చెబుతారు అని అందరూ ఎదురుచూస్తున్నారు అభిమానులు.

అయితే ఆయన పుట్టిన రోజుకి అన్నీ సినిమా పరిశ్రమల నుంచి విషెస్ వచ్చాయి, అయితే ఆయన ఎప్పడు పాన్ ఇండియా సినిమా చేస్తారు అని అభిమానులు చర్చించుకుంటున్నారు. వకీల్ సాబ్, క్రిష్, హరీష్ సినిమాలు ఒకే చేశారు, తర్వాత సురేందర్ రెడ్డి సినిమా కూడా చేస్తున్నారు. అయితే ఇది తెలుగుకి పరిమితమా లేదా పాన్ ఇండియా వరకూ వెళుతుందా అనేది చూడాలి.