పవన్ కల్యాణ్ సినిమాలకు దూరం అయి రాజకీయాల్లో కీలకంగా మారిపోయారు.. ఈ సమయంలో ఆయన ఏదైనా సినిమా చేస్తారా, లేదా మరోసారి ఎన్నికలు అంటే 2024 వరకూ ఆయన రాజకీయంగానే కొనసాగుతారా అనే చర్చ తెలుగు రాష్ట్రాల్లో జరుగుతోంది. అయితే పవన్ పింక్ సినిమా చేస్తారు అని అన్నారు కాని అది పట్టాలెక్కేలా కనిపించడం లేదు.
అయితే ఆయన సినిమాలకు దూరం అవుతున్నా అని గతంలో చెప్పారు. అందుకే ఆయన నటించకూడదు అని భావిస్తున్నారట. కాని ఆయన తాజాగా ఓ కొత్త సినిమా దర్శకత్వం చేయాలి అని చూస్తున్నారని వార్తలు వస్తున్నాయి. కొందరు సన్నిహితుల మధ్య టాక్ అయితే నడుస్తోంది. అందరికంటే ఆయన ఐడియాలజీ వేరుగా ఉంటుంది అనేది తెలిసిందే.
ఆయన ఆలోచనతో కథని సిద్దం చేస్తున్నారట.. పవన్ కల్యాణ్ సమర్పణలో ఇది వస్తుంది అని తెలుస్తోంది.. ప్రజల్లో మార్పువచ్చే దిశగా ఈ కథ రూపొందిస్తున్నారు అని టాక్ నడుస్తోంది.. పవన్ నటించకుండా ఆయన డైరెక్టర్ గా మారతారట. మరి ఇది ఎంత వరకూ వాస్తవమో చూడాలి .