బర్త్ డే రోజు అభిమానులకి త్రీ గిఫ్ట్స్ ఇచ్చి తీన్మార్ ఆడించబోతున్న పవర్ స్టార్ ..

బర్త్ డే రోజు అభిమానులకి త్రీ గిఫ్ట్స్ ఇచ్చి తీన్మార్ ఆడించబోతున్న పవర్ స్టార్ ..

0
103

అభిమానుల ఆరాధ్యదైవం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సంబరాలు మొదలై పోయాయి . అయితే తన బర్త్ డే రోజు పవన్ తన అభిమానులకు మూడు సర్ప్రైజ్ లను ఇవ్వబోతున్నట్టు సమాచారం . తన సినిమాలకి సంబందించిన విశేషాల్ని పూటకి ఒకటి చొప్పున రిలీజ్ చేయబోతున్నారట .అవేంటో మనం చూసేద్దాం .

ఉదయం 9 గంటల 9 నిమిషాలకి పవర్ స్టార్ ఇప్పుడు చేస్తున్న వకీల్ సాబ్ మూవీ మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది . మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకి అయన క్రిష్ తో చేస్తున్న మూవీ లోని ఓ సర్ప్రైసింగ్ పోస్టర్ ని రిలీజ్ చేస్తారట . సాయంతం 4 గంటలకి హరీష్ శంకర్ తో తీయబోయే సినిమా గురించి ఓ స్పెషల్ అప్డేట్ రానున్నట్లు సమాచారం .
ఒకేరోజు అభిమానులకి ట్రిపుల్ ధమాకా ఇవ్వబోతున్నాడు మన పవర్ స్టార్ .. అయితే పవన్ రాబోయే చిత్రాలన్నీ తమ అంచనాలని దాటేలా ఉండాలని అయన అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు .