వకీల్ సాబ్ చిత్రం పూర్తి చేసుకున్నారు పవన్ కల్యాణ్ … ఇక ఈ సినిమాకి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది, అయితే తాజాగా ఆయన మరో రెండు చిత్రాలు సెట్స్ పై పెట్టారు.. క్ర్రిష్ దర్శకత్వంతో ఆయన చేస్తున్నారు.. ఈ సినిమాతో పాటు
అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమా తెలుగు రీమేక్లో నటిస్తూ బిజీగా ఉన్నారు…ఇక క్రిష్ సినిమాని వేగంగా చేస్తున్నారు.
ఈ చిత్రం పవన్ కెరియర్ లో 27వ చిత్రం, ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ఆరో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాత్రలో కనిపించనున్నారు, దాదాపు రేపటి నుంచి ఈ సీన్లు ప్రారంభించి 12 రోజుల పాటు కీలక సన్నివేశాలు షూట్ చేయనున్నారు.
ఈ చిత్రం కోసం చార్మినార్, మచిలీపట్నం పోర్ట్ సెట్లను వేశారు. ఇందులో పవన్ కళ్యాణ్- అర్జున్ రాంపాల్లపై కొన్ని సీన్స్ షూట్ చేయనున్నారట. ఇక ఈ సినిమాలో పవన్ సరసన ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా, అర్జున్ రాంపాల్ సోదరి పాత్రలో బాలీవుడ్ భామ జాక్విలీన్ ఫెర్నాండజ్ కూడా నటిస్తున్నారు, ఇక మార్చి ఏప్రిల్ మే మూడు నెలలు ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది మే చివరి నాటికి పవన్ ఈ సినిమా షూటింగ్ కి ప్యాకప్ చెబుతారు అని టాక్ నడుస్తోంది.
హరి హర వీరమల్లు అనే టైటిల్ ఈ సినిమాకి పరిశీలన చేస్తున్నారట కాని దీనిపై ఇంకా అఫీషియల్ ప్రకటన రావాల్సి ఉంది.