Breaking News: ప్రెస్ క్లబ్ లో పోసానిపై పవన్ కళ్యాణ్ ఫాన్స్ దాడి..ఎందుకంటే?

Pawan Kalyan fans attack on Posani murali krishna

0
132

పోసాని కృష్ణ మురళి ప్రెస్ మీట్ లో దుమారం చెలరేగింది. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ అనంతరం పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలతో ఆగ్రహించిన పవన్ ఫాన్స్ పోసానితో గొడవకు దిగారు. దీనితో పోలీసులు రంగ ప్రవేశం చేసి పవన్ కళ్యాణ్ ఫాన్స్ ను అరెస్ట్ చేసి పంజాగుట్ట పోలీసు స్టేషన్ కు తరలించారు. కొద్దిరోజుల క్రితం రిపబ్లిక్ డే మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా పోసాని నిన్న ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనితో పవన్ ఫాన్స్ నన్ను టార్గెట్ చేసారంటూ మరోసారి పోసాని మీడియా ముందుకొచ్చారు.

ఈరోజు ప్రెస్ మీట్ లో పోసాని చేసిన వ్యాఖ్యలు ఇవే

పవన్ కళ్యాణ్ కు నామీద పీకల దాకా కోపం ఉంది. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజం, పవన్ కక్ష్య కట్టి మాట్లాడటం తప్పు అన్నారు. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా సమయంలో పవన్ స్వయంగా నాకు ఫోన్ చేసి తిట్టారు. కేసీఆర్ పవన్ ను తిట్టినప్పుడు ఈ ఫ్యాన్స్ ఎక్కడికిపోయారు. పవన్ పెంచుకుంటున్న ఫ్యాన్స్ లో కొంత మంది స్పెషల్ ఫ్యాన్స్ ఉన్నారు.

ఫ్యాన్స్ నాకు లక్షల మెసేజ్ లు పెడుతున్నారు. వ్యక్తిగత విమర్శలు చేస్తూ దుర్భాషలాడుతూ మెసేజ్ లు పెడుతున్నారు. కేశినేని మాటలకు చిరంజీవి కన్నీళ్లు పెట్టుకున్నారు. చిరంజీవి కుటుంబంపై కేశినేని చాలా మాట్లాడారు. కేశినేనితో చిరంజీవి వివాదాన్ని నేనే పరిష్కరించా..అప్పటి నుంచి చిరంజీవి నన్ను గుండెల్లో పెట్టుకున్నారు.

అన్నయ్య కూతుళ్లను అంటుంటే ఈ ఫ్యాన్స్ ఎక్కడపోయారు. పవన్ కళ్యాణ్ ఒక సైకో, పవన్ కళ్యాణ్ నువ్వు నియంతవా? వేరే హీరోల ఫంక్షన్ లకు నీ ఫ్యాన్స్ ను పంపించి జై కొట్టిస్తావా..పవన్ కళ్యాణ్ లాగా నా భార్య శీలం పొగొట్టుకోలేదు. ఇంట్లో ఆడవాళ్లను తిడితే చిరంజీవి లాంటి వాళ్లే డీమోరలైజ్ అయ్యారు. బెదిరిస్తే పోసాని ఇంట్లో కూర్చునేవాడు కాదు. రాజకీయాలను, ఫ్యాన్స్ ను అడ్డుపెట్టుకొని ఎందుకు వ్యక్తిగత విషయాలు మాట్లాడుతున్నావు? మీ ఫ్యాన్స్ కు ఏం చెబుతావో చెప్పుకో.

ఒక రాజకీయ నాయకుడి వికృతి రూపాన్ని చూపిస్తున్నా..పవన్ ఫ్యాన్స్ నియంత్రణలో పెట్టుకోకపోతే నేను ఆ స్థాయిలోనే మాట్లాడాల్సి వస్తుంది. నా భార్యను తిడితే నాకు బాధ కలగదా.ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి పవన్ సైకోలా తయారయ్యాడని ఘాటు వ్యాఖ్యలు చేశారు.