సినిమా ప్రొడ్యూసర్ గా మారనున్న పవన్ సినిమా డైరెక్టర్ ?

Pawan Kalyan film director who is going to become a film producer

0
136

ఇప్పుడు ఓటీటీలపై చాలా మంది దర్శకులు ఫోకస్ పెడుతున్నారు. వెబ్ సిరీస్ లు సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. సినిమా ప్రేక్షకులు కూడా వీటిని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వీటి ఆదరణ పెరిగింది. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకూ చాలా మంది వీటిని ఇష్టపడుతున్నారు.

ఇక వెండితెరలో సినిమాలకు ఇచ్చే రెమ్యునరేషన్లు ఇప్పుడు ఓటీటీలో కూడా అందుతున్నాయి. ఇప్పటికే కొందరు దర్శకులు ఓటీటీల్లో సినిమాలు తీస్తున్నారు. తాజాగా మరో దర్శకుడు సిద్దం అయ్యారు అనే వార్త వినిపిస్తోంది.

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో  సినిమా లైన్లో పెట్టిన హరీష్ శంకర్. దానితో పాటే ఓ వెబ్ సిరీస్ ను రూపొందించే పనిలో పడ్డారు. అయితే డైరెక్టర్ గా కాదు వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ గా అనే టాక్ నడుస్తోంది. అయితే గీతా ఆర్ట్స్ తో కలిసి ఆహా ఓటీటీ కోసం ఓ వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నారట హరీష్ .సంతోషం ఫేమ్ దశరథ్ డైరెక్ట్ చేయనున్నారట. అయితే నిర్మాణ భాగస్వామిగా ఆయన మారారు అనే వార్త విని అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు, అలాగే పవన్ అన్న సినిమా గురించి ఏదైనా చెప్పు బ్రదర్ అంటూ సోషల్ మీడియాలో కోరుతున్నారు.