కలకలం సృష్టిస్తున్న పవన్ ఇల్ల్లు

కలకలం సృష్టిస్తున్న పవన్ ఇల్ల్లు

0
110

సినీ విమర్శకుడు కత్తి మహేష్ పవన్ కళ్యాణ్ పై అవకాశం దొరికినప్పుడల్లా సైటర్లు వేస్తూ ఉంటాడు. గత కొంత కాలంగా పవన్ ను టార్గెట్ చేసే విషయంలో మౌనంగా ఉన్న కత్తి ఈ సరి మరింత పదునైన సంచలనాలతో పవన్ పై మాటల దాడి చేయడం వెంక ఆంతర్యం ఏమిటి అంటూ చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే పవన్ అమరావతిలో జనసేన కోసం కట్టిన ఇంటి విషయంలో కొన్ని విమర్శలు వచ్చిన నేపథ్యంలో వాటికి కొనసాగింపుగా పవన్ హైదరాబాద్ లో అత్యంత విలాస వంతమైన ఇల్లు కొనుక్కున్నాడు అంటూ కత్తి మరో సంచలనానికి శ్రీకారం చుట్టాడు.

అంతే కాదు దాని విలువ 130 కోట్లు ఉంటుంది అంటూ కత్తి మహేష్ పేరుతొ సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్న ట్విట్ వైరల్గా మారింది. దీనిని కత్తి మహేష్ చేశాడా లేక అతడి పేరు వాడుకుని పవన్ని దెబ్బ తియ్యాలని ఎవరైనా కత్తి పేరు వాడుకున్నారా అర్థం కావడం లేదు. ఇటీవల సైరా మూవీకి పవన్ వైస్ ఓవర్ ఇవ్వడం మల్లి పవన్ సినిమాలకు వస్తాడన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఇవన్నీ పుకార్లు పుట్టిస్తున్నారా అని అనిపించడం సహజం