ప‌వ‌న్ కల్యాణ్ ఆ ద‌ర్శ‌కుడితో సినిమా – టాలీవుడ్ టాక్?

Pawan Kalyan is a film with that director

0
101

ప‌వ‌న్ క‌ల్యాణ్ వ‌రుస‌గా సినిమాలు చేస్తున్నారు. ఇక ద‌ర్శ‌కులు కూడా ఆయ‌న‌కు క‌థ‌లు వినిపించేందుకు సిద్దంగా ఉన్నారు. ఈ స‌మ‌యంలో ఆయ‌న‌తో గ‌తంలో సినిమాలు చేసిన ద‌ర్శ‌కుల‌తో పాటు, ఇప్పుడు కొత్త ద‌ర్శ‌కులు కూడా క‌థ‌లు సిద్దం చేసుకుని, నిర్మాత‌ల ద్వారా ఆయ‌న‌కు క‌థ‌లు వినిపించేందుకు సిద్దంగా ఉన్నారు.

అయితే కొద్ది రోజులుగా ఆయ‌న‌తో ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్ సినిమా చేయ‌బోతున్నారు అనే వార్త వినిపించింది. అయితే ప్ర‌స్తుతం ఇద్ద‌రూ బిజీగా ఉండ‌టంతో ఈ ప్రాజెక్టులు పూర్తి అయిన త‌ర్వాత ఈ ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్కే అవ‌కాశం ఉంది అని వార్త‌లు వినిపించాయి. తాజాగా టాలీవుడ్ వార్త‌ల ప్ర‌కారం పవన్ కల్యాణ్ కోసం ఒక కొత్త కథను తయారు చేసుకున్న పూరి, రీసెంట్ గా ఆయనను కలిసి వినిపించార‌ట.

ఈ స్టోరీ బాగుంద‌ని ప‌వ‌న్ ఒకే చెప్పారు అనే వార్త‌లు టాలీవుడ్ లో వినిపిస్తున్నాయి. ఇక పూరీ జ‌గ‌న్నాథ్ కి ప‌వ‌న్ క‌ల్యాణ్ కు ఎంతో మంచి స్నేహం ఉంది. వీరి కాంబినేషన్లో వచ్చిన బద్రి ఎంత పెద్ద సూపర్ హిట్ అయిందో తెలిసిందే. త‌ర్వాత కెమెరా మెన్ గంగతో రాంబాబుచేశారు. ఇక తాజాగా కొత్త ప్రాజెక్ట్ గురించి కూడా త్వ‌ర‌లో ప్ర‌క‌ట‌న రావ‌చ్చు అని టాక్ టాలీవుడ్ లో న‌డుస్తోంది.