మరో సినిమా అనౌన్స్ చేసిన పవన్ కల్యాణ్ దర్శకుడు ఎవరంటే

-

ఈ ఎన్నికల్లో నిలబడిన పవన్ కల్యాణ్ ఎన్నికలకు ముందు నుంచి చాలా కాలం సినిమాలకు దూరంగా ఉన్నారు, అంతేకాదు ఇలా సినిమాలు ఎప్పుడు చేస్తారా అని అభిమానులు అందరూ ఎదురుచూశారు, మొత్తానికి లాంగ్ గ్యాప్ తీసుకుని ఆయన వకీల్ సాబ్ చిత్రం అనౌన్స్ చేశారు.

- Advertisement -

చాలా నెలల పాటు సినిమాలకు దూరంగా ఉన్న జనసేనాని పవన్ కల్యాణ్ ఇప్పుడు మళ్లీ సినిమాలపై ఫోకస్ పెట్టడం అభిమానులకి చాలా ఆనందంగా ఉంది, అంతేకాదు ఈ సినిమాతో పాటు పలు సినిమాలు కూడా ఆయన ఓకే చేస్తున్నారు.

ఇటీవల క్రిష్, హరీశ్ శంకర్, సురేందర్ రెడ్డిల దర్శకత్వాలలో సినిమాల ప్రకటనలు వెలువడ్డాయి. అయితే తాజాగా ఈ దసరాకి మరో సినిమా అనౌన్స్ మెంట్ కూడా వచ్చింది…సితార ఎంటర్టైన్ మెంట్ బ్యానర్ పై సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు పవన్.సూర్యదేవర నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని అందించనున్నాడు. మలయాళంలో హిట్ అయిన అయ్యప్పనుమ్ కోశియుమ్సకు ఈ సినిమా రీమేక్ గా తెలుగులో రానుంది, ఈ చిత్రాలు చేశాక ఈ కొత్త చిత్రం పట్టాలెక్కించనున్నారు పవన్ కల్యాణ్.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

హైదారాబాద్ లో మహిళా పోలీసుల కోసం వినూత్న నిర్ణయం

మహిళా పోలీసుల కోసం హైదరాబాద్ పోలీసులు వినూత్న నిర్ణయానికి శ్రీకారం చుట్టారు....

ముగ్గురు భారతీయుల్ని ఆరెస్ట్ చేసిన కెనడా పోలీస్

ఖలిస్తాన్ సపరేటిస్ట్ లీడర్ హర్దీప్ సింగ్ నిజ్జర్(Hardeep Nijjar) హత్యకేసులో ముగ్గురు...