పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆ సమయం రానే వచ్చింది. ఇన్‌స్టాగ్రామ్(Instagram)లో పవర్ స్టార్ మొదటి పోస్టు పెట్టేశారు. ‘మన బంధం ఇలానే కొనసాగాలని, మరెన్నో మధురమైన జ్ఞాపకాల్ని పంచుకోవాలని ఆశిస్తున్నాను’ అంటూ ఆసక్తికర కొటేషన్ పెట్టారు. అంతేగాక, ఇండస్ట్రీలోని ప్రముఖ హీరోలు అమితాబ్ బచ్చన్, మెగాస్టార్ చిరంజీవి, బాలయ్య, నాగార్జున, వెంకటేశ్, మహేశ్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రవితేజ, నాని, శర్వానంద్, ఇలియానా, సమంత, రాజమౌళి, క్రిష్, పూరి జగన్నాథ్, త్రివిక్రమ్‌లతో పాటు ప్రముఖులతో కలిసున్న ఫొటోలను షేర్ చేశారు. దీంతో ఎమోషనలైన పవర్ స్టార్(Pawan Kalyan) అభిమానులు ‘ఇందుకే కదా నిన్ను దేవుడు అనేది’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
Read Also: పవన్ కల్యాణ్ ‘BRO’ నుంచి సరికొత్త అప్‌డేట్
Follow us on: Instagram Threads, Google News, Koo, Twitter, ShareChat