ఇక్కడ ఫ్లాప్.. అక్కడ సూపర్ హిట్.. పవన్ సినిమాల్లో అది ఓ మైలురాయి..!!

ఇక్కడ ఫ్లాప్.. అక్కడ సూపర్ హిట్.. పవన్ సినిమాల్లో అది ఓ మైలురాయి..!!

0
103

టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ రేంజ్ ఏంటో అందరికి తెలిసిందే.. అయన సినిమా వస్తుందంటే చాలు కోట్లాది మంది ప్రేక్షకులు పడిచస్తారు.. అలాంటిది సినిమాలు వదిలి రాజకీయాల్లోకి వెళ్లారు పవన్.. అయితే అయన నటించిన చివరి చిత్రం అజ్ఞాతవాసి తెలుగులో ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే..

తెలుగులో ప్లాప్ అయిన ఈసినిమాను హిందీలో డబ్బింగ్ చేసి యూట్యూబ్ లో రిలీజ్ చేశారు. గతేడాది అక్టోబర్ లో మూవీని డబ్బింగ్ చేసి యూట్యూబ్ లో పెట్టగా ఇప్పటి వరకు 100 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకొని సరికొత్త రికార్డును నెలకొల్పింది. దాదాపు 4.6 లక్షలకు పైగా లైక్ లు వచ్చాయి.

అజ్నాతవాసి మూవీ దేశవ్యాప్తంగా బిగ్గెస్ట్ డిజాస్టర్స్‌లో మూడో ప్లేస్‌లో నిలిచింది. దీనికంటే ముందు ‘బాంబే వెల్వెట్’ మొదటి స్థానంలో ఉండగా.మహేశ్.’స్పైడర్’ ఆల్ టైమ్ ఇండియన్ బిగ్గెస్ట్ డిజాస్టర్స్‌లో రెండో ప్లేస్‌లో నిలిచింది.