పవన్ సినిమా నిర్మాణ బ్యానర్ మారింది కారణం ఇదే

పవన్ సినిమా నిర్మాణ బ్యానర్ మారింది కారణం ఇదే

0
100

తెలుగు తమిళ్ లో సూపర్ బ్యానర్ అంటే పెద్ద బ్యానర్ గా పేరు తెచ్చుకుంది సూర్య మూవీస్.. ఎఎమ్ రత్నం నిర్మాతగా ఈ బ్యానర్ అనేక మంచి సినిమాలు, భారీ సినిమాలు అందించింది. 80 శాతం హిట్ సినిమాలే అని చెప్పాలి, తమిళ్ తెలుగులో అనేక పెద్దసినిమాలు చేశారు, చాలా మంది అగ్రహీరోలు ఈ బ్యానర్ లో నటించారు.

తాజాగా పవన్ కల్యాణ్ తో ఏ ఎమ్ రత్నం సినిమా చేస్తున్నారు, ఆయన బ్యానర్ లో క్రిష్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. నిన్న సినిమాకి క్లాప్ కొట్టారు, అయితే తాజాగా వస్తున్న వార్త మాత్రం కాస్త ఆశ్చర్యం కలిగిస్తోంది.
ఈ సినిమా బ్యానర్ మారింది అంటున్నారు. సూర్య మూవీస్ కు బదులు మెగా సూర్య ప్రొడక్షన్స్ అనే కొత్త బ్యానర్ కనిపించింది క్లాప్ బోర్డుపై.

అయితే ఇందులో పవన్ నిర్మాతగా మారారా అనే అనుమానం అందరికి వచ్చింది.. కాని అసలు విషయం అది కాదు అంటున్నారు. ఎఎమ్ రత్నం సూర్య మూవీస్ కు కొన్ని పాత ఇబ్బందులు ఉన్నాయట అందుకే ఆయనే కొత్తగా ఇలా బ్యానర్ మార్చారు అంటున్నారు.